దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీలు విచ్చలవిడిగా పన్నులు విధిస్తున్నాయి : చేవూరు దేవకుమార్ రెడ్డి
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీలు విచ్చలవిడిగా పన్నులు విధిస్తున్నాయి
నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి
-: నెల్లూరు, ఆగష్టు 1 (సదా మీకోసం) :-
నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లా, మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నూతన కమిటీలను ఏర్పాటు చేయడం కోసం నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలతో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ డిపార్ట్మెంట్
చైర్మన్ లు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్, రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షులు నులకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు దాదా గాంధీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు శాంతా కుమారిలు ముఖ్య అతిధులుగా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సంధర్భంగా నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు చేవూరు.దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనకు కొత్త నిర్వచనం చెప్పేందుకు దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీలు విచ్చలవిడిగా విచిత్రమైన పన్నులు విధించి ప్రజలను పేద,మధ్య తరగతి మరియు ధనిక అనే వ్యత్యాసాలు లేకుండా ఒకే వర్గానికి అనగా దిగువ పేద వర్గ ప్రజలుగా చేసి ప్రజల మనుగడకు ప్రమాధాన్ని కలిగిస్తుందన్నారు.
రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి.వినయ్ కుమార్ మాట్లాడుతూ… కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న B.J.P. మరియు Y.C.P. ప్రజలపై అధిక ధరలతో భారం మోపారని కేంద్రం తీసుకొచ్చిన G.S.T. వల్ల దేశ వ్యాప్తంగా అధిక ధరలు పెరిగాయని G.S.T వల్ల పెట్రోలు డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు పెరిగాయి అన్నారు. B.J.P. అంటే రాష్ట్రంలో B.అంటే బాబు అని J.అంటే జగన్ అని
P.అంటే పవన్ అని వీరు ముగ్గురు బీజేపీ ముసుగుతో రాష్ట్రంలో పని చేస్తున్నారన్నారు.23 సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని రాష్ట్రంలోనూ దేశంలోనూ రాక్షస పాలన సాగుతోందని ఆయన అన్నారు.
రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు నులుకుర్తి.వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ… బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు దాదా గాంధీ గారు మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం నిర్వీర్యం చేశారని మైనారిటీ వర్గాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే స్వేచ్ఛగా ఉంటారని ప్రజలందరికీ అర్థం అయింది అన్నారు.
ఈ సంధర్భంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు చేవూరు దేవకుమార్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితుడిగా తన పరిధిలో షేక్. ఖాజా మస్తాన్ సుమారు 150 మందికి పైగా తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లేళ్ళపల్లి.సురేష్ బాబు,నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉడతా వెంకట్రావు,షేక్.ఫయాజ్, పరిమళ వెంకటేశ్వర్లు, దుద్దుకూరి రమేష్ నాయుడు, వెంకటయ్య, సీనియర్ నాయకుడు భవానీ నాగేంద్ర ప్రసాద్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఏటూరి శ్రీనివాసులు రెడ్డి, కొండా అనిల్ కుమార్, పప్పర్తి.
గణేష్ బాబు, షేక్ అల్లావుద్దీన్, లతా రెడ్డి, షేక్.ఛాన్బాషా, P.C.C.సభ్యులు యుగంధర్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు రాజేష్ రెడ్డి, షేక్.హుస్సేన్ బాషా, ఆరవ రామ్మోహన్ రావు, మావులూరు సురేష్ బాబు, మండలాధ్యక్షులు గొట్టిగుండాల మహేష్ రెడ్డి, వేలమూరి శివశేఖర్ రెడ్డి, కిషోర్ బాబు, కంచి వెంకటేశ్వర్లు, బాలయ్య, హజరత్తయ్య, హరిబాబు, మోహన్ రెడ్డి, సర్ఫరాజ్ షబ్బీర్, రహమాన్, మురళి, మంజుల, గీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.