లోకేష్ కి జనంలో పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలెత్తుతున్న వైసీపీ : చేజర్ల

0
Spread the love

లోకేష్ కి జనంలో పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలెత్తుతున్న వైసీపీ

  • అందుకే లోకేష్ పై నిందలు
  • శవ రాజకీయాల నుండి పుట్టిన పార్టీ వైసీపీ
  • అందుకే వారు నిత్యం శవ రాజకీయాలే చేస్తుంటారు
  • ఆంధ్రుల ఆరాధ్యదైవం అయిన ఎన్టీఆర్ కుమార్తె మృతిని సైతం రాజకీయం చేస్తూ నికృష్ట రాజకీయాలు చేస్తున్న వైసీపీ
  • నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ తమకు వీలైనంత వరకూ వేరే వారికి సహాయం చేసేవారే కానీ, వేరే వారి ఆస్తులకు ఆశ పడే వారు కాదు
  • తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

కోవూరు, ఆగ‌ష్టు 4 (స‌దా మీకోసం) :

కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ కి రాష్ట్రం లో పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలిత్తిపోతున్న వైసీపీ నాయకులు, ఆయన ప్రతిష్ట దిగజార్చడానికి అనేక కుట్రలు చేస్తున్నారు.అందులో భాగంగానే అన్న ఎన్టీఆర్ గారి కుమార్తె శ్రీమతి ఉమామహేశ్వరి మృతి కి లోకేష్ కారణం అని భూటకపు ప్రచారం మొదలెట్టారన్నారు.

జూబ్లీహిల్స్ లో లేని సర్వే నంబర్లు ఉటంకిస్తూ,ఆ సర్వే నంబర్లు లో ఉన్న భూమిని తనకు ఇవ్వమని లోకేష్ తన పిన్ని అయిన ఉమామహేశ్వరి గారిపై ఒత్తిడి చేశారని, అందువలనే ఆమె ఉరి వేసుకొని చనిపోయినదని బూటకపు ప్రచారంను జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వైసీపీ నాయకులు మొదలెట్టారన్నారు.

నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ తమకు వీలైనంత వరకూ వేరే వారికి సహాయం చేసేవారే కానీ,వేరే వారి ఆస్తులకు ఆశ పడే వారు కాదని స్ప‌ష్టం చేశారు.

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టడమే శవ రాజకీయాలు నుండి పుట్టింది.

అందుకే వారు నిత్యం శవ రాజకీయాలు చేస్తుంటారని, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి శవం పక్కన పెట్టుకొనే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేయించాడ‌ని, తన తండ్రి మృతిని చూపించి ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ ఓదార్పు యాత్ర చేసాడని విమ‌ర్శించారు.

2019 ఎన్నికల ముందు తన బాబాయిని తన బంధువులే హత్య చేస్తే, చంద్రబాబు నాయుడు హత్య చేయించడాని ఊరు, వాడ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందారని, మూడు సంవత్సరాలు గడిచిన ఇంత వరకూ బాబాయి హంతకులు ఎవరో తేల్చలేదన్నారు.

గతంలో భూమా నాగరెడ్డి చనిపోయినప్పుడు కూడా చంద్రాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వక పోవడంతో మానసిక ఆందోళనకు గురై మరణించారని ప్రచారం చేశారని గుర్తు చేశారు.

చంద్రబాబు నాయుడుని,లోకేష్ ను ఎదుర్కొన లేక వైసీపీ పార్టీ ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నది.ఏదోవిధంగా లోకేష్ గారి ఇమేజ్ దెబ్బ తీయక పోతే భవిష్యత్తులో తమకు ఇబ్బంది అనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ ఎక్కడ ఏమి జరిగినా దానికి కారణం లోకేష్ అని ప్రచారం చేస్తుందన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!