అస్త్యవస్థ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

0
Spread the love

అస్త్యవస్థ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం : చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

  • ఊరి మధ్యలో ఉండవలసిన పాఠశాలను ఊరికి దూరం చేస్తూ,ఊరికి దూరంగా ఉండవలసిన మధ్యం షాపులను మాత్రంఊరి మధ్య పెడుతున్న జగన్ సర్కారు
  • అస్త్యవస్థ విధానాలతో ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తున్నారు.3,4,5 తగతుల విలీనం వలన బడి మానే విద్యార్థులు పెరిగే ప్రమాదం ఉంది
  • ప్రపంచ బ్యాంకు అప్పుకోసమే పాఠశాలల విలీనం
  • తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో బడ్జెట్లో సరాసరి ఏడాదికి 14.12 శాతం విద్యకు ఖర్చు చేస్తే,వైసీపీ హయాంలో కేవలం 9.6 శాతం మాత్రమే ఖర్చు చేశారు
  • విద్యా మంత్రి గారు రోజుకొక మాట చెప్పడం మాని 3,4,5 తరగతుల విలినాన్ని ఉపసంహరించుకొని పాత విధానాన్ని కొనసాగించాలి
  • ప్రపంచంలోనే మాతృ భాషలో చదువుకునే అవకాశం లేని ఏకైక రాష్ట్రం ఆంద్రప్రదేశ్
  • తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి

నెల్లూరు, జూలై 17 (సదా మీకోసం):

నెల్లూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో విద్యారంగాన్ని బ్రష్టు పట్టించారు.తన అస్త్యవస్థ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల ను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.

ఊరి మధ్యలో ఉండవలసిన పాఠశాలను ఊరికి దూరం చేస్తూ,ఊరికి దూరంగా ఉండవలసిన మధ్యం షాపులను మాత్రం ఉరి మధ్య పెడుతున్నారని తెలిపారు.

3,4,5 తరగతుల విద్యార్థులు అంటే 8 నుండి 10 సంవత్సరాలు మధ్య వయస్సు పిల్లలు ఉంటారని, ఈ వయస్సు లో రెండు, మూడు కిలోమీటర్ల నడిచి పాఠశాలలకు వెళ్లాలంటే అది జరిగే పనేనా అని ప్రశ్నించారు.

దీని వలన పిల్లలు బడి మానేయ్యడమో లేదా శక్తి లేక పోయినా ప్రయివేటు పాఠశాలలో చేరడమో జరుగుతుందని, దీని వలన పేద పిల్లల చదువుకు దూరం అయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రపంచ బ్యాంకు ఇస్తానని చెప్పిన 250 మిలియన్ డాలర్ల రుణం కోసం ప్రపంచ బ్యాంకు పెట్టిన షరతులలో భాగంగానే 3,4,5 తరగతుల విలీనం చేస్తున్నారని, అప్పు కోసం విద్యార్థుల జీవితాలను సైతం పణంగా పెడుతున్నారని తెలిపారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యా రంగానికి పెద్ద పీట వేసి బడ్జెట్లో విద్యారంగానికి సరాసరి ఏడాదికి 14.12 శాతం ఖర్చు చేస్తే,నేడు వైసిపి ప్రభుత్వం ఏడాదికి 9.6 శాతం మాత్రమే ఖర్చు చేసింది.దీనిని బట్టి విద్యకు ఎవరు ప్రాధాన్యత ఇచ్చారో అర్ధమౌతుందన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం17,591 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా,4,857 పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూములు,7500 పాఠశాలలకు ఫైబర్ నెట్ సౌకర్యం,40,665 పాఠశాల లో మరుగు దొడ్లు,రూ.205 కోట్లతో ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి అన్ని మౌలిక వసతులను కల్పించిందని పేర్కొన్నారు.

హైబ్రీడ్ యాస్యూటి మోడల్ క్రింద రాష్ట్రంలో ఉన్న పాఠశాలలో మౌలిక వసతులు కల్పన కోసం రూ.4848 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో పనులు ప్రారంభం కాలేదు.ఆ పథకాన్ని వైసిపి ప్రభుత్వం నాడు,నేడు అని పేరు మార్చి అమలు చేస్తూ కొత్త పథకం అని గొప్పలు చెప్పుకుంటుందన్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం అన్ని పాఠశాలలో ఆంగ్ల మధ్యమాన్ని ప్రవేశపెట్టింది.అయితే ప్రతి పాఠశాలలో తెలుగు,ఆంగ్ల మాధ్యమాలు రెండు ఉంచి విద్యార్థి తన ఇష్టమైన మాద్యమములో చదువుకొనే అవకాశం కల్పించింది అయితే నేడు వైసీపీ ప్రభుత్వం కేవలం ఆంగ్ల మద్యమాన్ని మాత్రమే ఉంచి తెలుగు మద్యమాన్ని తీసివేసిందని విమర్శించారు.

ప్రపంచంలో ఏ దేశంలో అయిన ప్రాధమిక విద్య మాతృభాషలో చదువుకొనే అవకాశం ఉంటుంది. మాతృ భాష లో చదువుకొనే అవకాశం లేని ఏకైక రాష్ట్రం ఆంద్రప్రదేశ్ మాత్రమే అని తెలిపారు.

విద్యా మంత్రి బొత్సా సత్య నారాయణ రోజుకొక మాట చెప్పడం మాని 3,4,5 తరగతుల విలినాన్ని ఉపసంహరించుకొని, పాత విధానాన్ని కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!