బుచ్చిలో అంబేడ్కర్ ఇండియా మిషన్ అవగాహన సదస్సు

బుచ్చిలో అంబేడ్కర్ ఇండియా మిషన్ అవగాహన సదస్సు
-: బుచ్చి రెడ్డి పాళెం, ఆగష్టు 1 (సదా మీకోసం) :-
మండలం కేంద్రంలోని అంబేడ్కర్ భవనం నందు అంబేడ్కర్ ఇండియా మిషన్ (ఏ.ఐ.యం) అవగాహన సదస్సును మండల కన్వీనర్ రవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అధితిగా జిల్లా ఇంఛార్జి రమేష్ నాయుడు విచ్చేశారు.
మొదటగా ప్రతీ గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది.
అనంతరం రమేష్ నాయుడు మాట్లాడుతూ దళిత కాలనీల్లో ఎక్కువగా యువత చదువుకోవడం మధ్యలోనే మానేస్తున్నారని, వారంతా చదువులు పూర్తి చేశాలా తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు.
చదువులు పూర్తి చేసి చిన్న ఉద్యోగమో వ్యాపారమో చేయడం వల్ల ఆ కుటుంబం ఆర్ధికంగా అభివృద్ధిలోకి వస్తుందని అలాగే ఆ గ్రామంలో కుటుంబాలన్నీ అభివృద్ధి చెందితే ఆ గ్రామం అభివృద్ధి అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంబేడ్కర్ ఇండియా మిషన్ ద్వారా గ్రామాల్లో చదువు యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ, దళితుల ఐక్యత, చైతన్యం కోసం పని చేస్తోందని తెలిపారు.
కార్యక్రమంలో ఏ.ఐ.యం ఆత్మకూరు డివిజన్ కన్వీనర్ పి. మురళీ, మండల కమిటీ సభ్యులు విజయ భాస్కర్, వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.