ముందస్తు చర్యలు తీసుకున్నందున ఎటువంటి ప్రాణం నిష్టం, ఆస్తి నష్టం లేదు

0
Spread the love

ముందస్తు చర్యలు తీసుకున్నందున ఎటువంటి ప్రాణం నిష్టం, ఆస్తి నష్టం లేదు
జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రదర్ బాబు

నెల్లూరు ప్ర‌తినిధి , న‌వంబ‌ర్ 20 (స‌దా మీకోసం) :

గడచిన రెండు వారాలుగా భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలో జిల్లాలో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నందున ఎటువంటి ప్రాణం నిష్టం, ఆస్తి నష్టం లేకుండా నివారించగలిగామని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రదర్ బాబు తెలిపారు. శనివారం ఉదయం నగరంలోని డికేడబ్లూ, కాలేజీ, సంతపేట ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను వారు సందర్చించారు.

భగత్ సింగ్ కాలనీ. జనార్ధన రెడ్డి కాలని పోర్టు కట్ట ప్రాంతానికి చెందిన ముంపు బాధిత ప్రజలతో వారు మాట్లాడారు. వారికి అందుతున్న విజన్ వసతి, మంచినీటి సౌకర్యం గురించి విచారించి వారికి అవసరమైన దుప్పట్లు కూడా అందజేయాలని అధికారులను ఆదేశించారు. వరద తగ్గేవరకూ పునరావాస కేంద్రాలను కొనసాగిస్తామని ఎటువంటి ఆందోళన పడకుండా ఉండాలన్నారు. పెన్నా నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాలు అంది తగు చర్యలు తీసుకోవాలని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహిట్ ను ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ పెన్నా నదీ పరివాహక ప్రాంతాల గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, సముద్ర తీర ప్రాంతానికి చెందిన మత్స్యకారులను సమంగా శాఖ సూచనలతో సముద్రం నుండి వెనక్కి తీసుకు రావడం జరిగిందన్నారు. అన్ని చెరువులపై నీటిపారుదల శాఖ బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవకణ జరుగుతుందన్నారు. జిల్లాలో 2 ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు ,2 ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయ సహకారాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మత్స్యశాఖ, పోర్టు నుండి పడవలను తెప్పించి సిద్ధంగా ఉంది’మన్నారు.

జిల్లా కేంద్రంలో 1077 నెంబర్ తో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ముందస్తు చర్యలకు ముందుండి తగు ఆదేశాలు ఎప్పటికప్పుడు అందించిన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ,రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు శ్రీ పి .అనిల్ కుమార్ లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా జిల్లాకు ప్రత్యేక అధికారి గా వచ్చిన విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ రాజశేఖర్ గారి సూచనలు సలహాలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాబోవు 18 గంటల వరకు భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరు” అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!