తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో తనిఖీ చేసిన మంత్రి ఆళ్ల నాని
తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో తనిఖీ చేసిన మంత్రి ఆళ్ల నాని
-: తిరుపతి, ఆగస్టు 6 (సదా మీకోసం) :-
చిత్తూరు జిల్లా తిరుపతి పద్మావతి స్విమ్స్ కోవిడ్ హాస్పిటల్ లో స్వయంగా పిపిఈ కిట్టు ధరించి కరోనా రోగులు ఉన్న వార్డును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తనిఖీ చేశారు.
మంత్రి ఆళ్ల నాని వెంట ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ.. మంత్రి ఆళ్ల నాని స్వయంగా కోవిడ్ వార్డ్ లో రోగులు వద్దకు వెళ్లి వారి నుండి వివరాలు తెలుసుకున్నారు.
కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయడంతో పాటు వైద్య సదుపాయం ఎలా ఉన్నాయనే వివరాలు సేకరించారు.
భోజనం… శానిటేషన్… మంచినీరు సక్రమంగా సమయానికి అందుతున్నాయా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశిo చ డం తో మీ దగ్గరికి వచ్చానని కోవిద్ బాధితులకు తెలిపారు.
ప్రతి కరోనా బాధితుడికి భోజనం కోసం 5వందలు రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి నెలకు 350కోట్లు రూపాయలు కరోనా బాధితులకు ఖర్చు చేయాలని కేటాయించారని తెలిపారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా రోజు కి 50వేలు టెస్ట్లు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని అన్నారు.