డాక్టర్ ర‌వీంద్ర నాయ‌క్‌ హత్య వెనుక మిస్టరీ వీడేనా…?

1
Spread the love

 

డాక్టర్ ర‌వీంద్ర నాయ‌క్‌ హత్య వెనుక మిస్టరీ వీడేనా…?

  • న్యాయం చెయ్యడంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న డాక్టర్ కుటుంబ సభ్యులు

-: రాపూరు, ఆగస్టు 6 (స‌దా మీకోసం) :-

రాపూరు పట్టణానికి సమీపంలోని పులిగిలపాడు వద్ద గల కరుణామయి ఆసుపత్రిలో డాక్టర్ రవీంద్ర నాయక్ హత్య వెనుక మిస్టరీ వీడేనా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.

హత్య జరిగి రెండున్నర నెలల తర్వాత వెలుగులోకి రావడం పట్ల పలు అనుమాలు వ్యక్తం అవుతున్నాయి.

హత్య కి కారణాలను, హత్య జరిగిన విధానాన్ని పోలీసులు వెల్లడించినా, వారు చెప్పేదానికి, కుటుంబ సభ్యులు చెప్పే వివరాలకు పొంతన లేకపోవడం, అదే రోజు నుంచి సీసీ కెమెరాలు పని చేయకపోవడం, డాక్టర్ గదిలోనే పర్స్, అతనికి సంబంధించినవన్ని ఉండటం, కనీసం ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకపోవడం, హత్య వెనుక మరి కొందరు ఉన్నారని …ఆసుపత్రి యాజమాన్యం హ‌స్తం ఉందని కుటుంబ సభ్యులు బలంగా ఆరోపించడం మరిన్ని అనుమానాలుకు తావిస్తుంది.

పోలీసులు కథనం ప్రకారం సెక్యూరిటీ గార్డు ఒక్కరే హత్య చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులను చూసి భయంతో లొంగిపోయారని చెప్తున్నారు.

కాని అది పూర్తి అవాస్తవమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

తమ కొడుకు ఆరు అడుగుల ఎత్తు అని , పొట్టి గా వుండే ఒక్కరు చంపడం, 7 కిలోమీటర్ల దూరానికి శవాన్ని ఒక్కరే తీసుకెళ్ళాడం అసంభవమని చెబుతున్నారు.

డాక్టర్ రవీంద్ర నాయక్ హత్య ఒక పథకం ప్రకారం, కొందరు వ్యక్తులు చేసివుంటారని ఆరోపిస్తున్నారు.

నెల్లూరు ఎస్సి, ఎస్టీ సెల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం…

డాక్టర్ రవీంద్ర నాయక్ నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, పార్ట్ టైం డాక్టర్ రాపూరు మండలంలోని పులిగిలపాడు గ్రామంలోని కరుణామయి ఆసుపత్రి లో డాక్టర్ ఓ రూం లో నివాసం ఉంటూ అక్కడే 2019 ఫిబ్రవరి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు.

డాక్టర్ రవీంద్ర ది అనంతరంపురం జిల్లా కావడంతో ఆసుపత్రి యాజమాన్యమే డాక్టర్ కి వసతి కల్పించింది.

ఈ డాక్టర్ కి అదే ఆసుపత్రి లో సెక్యూరిటీ గార్డు గా పని చేస్తున్న బి.అంకయ్యతో అమ్మాయిల విషయంలో( అక్రమ సంబంధాల) వివాదాలు ఉన్నాయి.

మే 14 తేదీన డాక్టర్ రవీంద్ర పుట్టిన రోజు సందర్భంగా అక్కడ పనిచేసే కొంతమంది సిబ్బంది కి మందు పార్టీ ఇచ్చారు.

మద్యం సేవించి అందరూ వెళ్ళిపోయారు. సెక్యూరిటీ గార్డు అంకయ్య, డాక్టర్ మాత్రమే మిగిలారు.

వారి మధ్యలో అమ్మాయిల విషయం మై గొడవలు చెలరేగాయి.

మద్యం మత్తులో వున్న అంకయ్య కోపంలో డాక్టర్ ను బీరు బాటిల్ తో బలంగా తల పై కొట్టారు.

దీంతో రక్తం కారుతున్న అతన్ని ఆ గది నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని మైదానంలోకి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. యథాతథంగా తన విధుల హాజరవుతున్నాడు.

డాక్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆసుపత్రి యాజమాన్యానికి కాల్ చేసి పోలీసులు పిర్యాదు చేయవలసినదిగా కోరారు.

కానీ యాజమాన్యం నిరాకరించారు. దీంతో వారి అనుమానానికి మరింత బలం వచ్చి వారే నేరుగా రాపూరు పోలీసులను ఆశ్రయించారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసుకొన్న రాపూరు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తుండగా నేరస్థుడు అయిన అంకయ్య భయం తో లొంగి పోయాడని, డాక్టర్ ని ఎలా హత్య చేశాడో, ఆ సీన్ ను రీ కనస్ట్రక్షన్ చేశామని పోలీసులు వెల్లడించారు.

నేరస్థుడు తాను శవాన్ని తగులబెట్టిన ప్రదేశం, ఆనవాళ్ళు, ఆధారాలను సేకరించారు. అతనిపై హత్య చేసినట్లు కేసు నమోదు చేసి , కోర్టు లో హజరు పరచనున్నారు.

కుటుంబ సభ్యుల అనుమానం

పోలీసులు కేసును ప్రక్కదారి పట్టిస్తున్నారని, సెక్యూరిటీ గార్డు ఒక్కరే తమ కుమారుడిని చంపివుండరని ఇందులో ఆసుపత్రి యాజమాన్యం తోపాటు, మరికొందరి అస్తం ఉండివుంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

రాపూరు మండలం పులిగిలపాడులోని శ్రీం ఫౌడేషన్ ఆధ్వర్యo లో నడుస్తున్న శ్రీకరుణామయి హాస్పిటల్ లో దారుణం జ‌రిగింద‌ని చ‌నిపోయిన డాక్ట‌ర్ బందువులు ఆరోపిస్తున్నారు.

 

దారుణ హత్య కు గురైన డాక్టర్ రవీంద్ర నాయక్ ఫైల్ ఫోటో
దారుణ హత్య కు గురైన డాక్టర్ రవీంద్ర నాయక్ ఫైల్ ఫోటో

1 thought on “డాక్టర్ ర‌వీంద్ర నాయ‌క్‌ హత్య వెనుక మిస్టరీ వీడేనా…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!