కలసి పనిచేద్దాం… వామపక్షాల నేతలతో టీడీపీ నేతలు భేటీ
కలసి పనిచేద్దాం… వామపక్షాల నేతలతో టీడీపీ నేతలు భేటీ
నెల్లూరు ప్రతినిధి, ఆగస్టు 6 (సదా మీకోసం):
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పొలిటి బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన వామపక్ష నేతలతో భేటీ అయ్యారు.
కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టుతోపాటు ప్రజా సమస్యలపై చర్చించారు.
జిల్లాలోని రైతాంగ సమస్యలు, పోలీసు అరాచకాలు, థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణల పై టీడీపీ, సీపీఐ, సీపీఎం, కలిసి పోరాడాలని తీర్మానించారు.
మిగిలిన పార్టీలు ఏవైనా కూడా పోరాటానికి మాతో చేతులు కలిపితే, వారితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
సమావేశంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి , టి.అనురాధ సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి కే. అజయ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వి. రామరాజు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కే .రాంబాబు పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం మోహన్ రావు జేఏసీ నాయకులు కే. రవి ,ఏ .అనిల్, ఎం .రవీంద్ర ,పి. వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.