ఒంటి పూట బడులు, వేసవి సెలవలు మంజూరు చేయండి : భారతీయ యువమోర్చా జిల్లా అధ్యక్షలు యశ్వంత్ సింగ్
ఒంటి పూట బడులు, వేసవి సెలవలు మంజూరు చేయండి
భారతీయ యువమోర్చా జిల్లా అధ్యక్షలు యశ్వంత్ సింగ్
నెల్లూరు నగరం, మార్చి 17 (సదా మీకోసం) :
ఒంటి పూట బడులు, వేసవి సెలవల మంజూరులో జాప్యం గురించి కలెక్టర్ కార్యాలయంలో ఏవో సుబ్రహ్మణ్యంని భారతీయ యువమోర్చా జిల్లా అధ్యక్షలు యశ్వంత్ సింగ్ ఆధ్వర్యంలో కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణం లోని మార్పులు, వేసవికాలంలో మండుటెండలు కారణంగా విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వాలు పాఠశాలలకు మార్చి నెలలో ఒంటిపూట బడులు, అనంతరం నడివేసవి అయినటువంటి మే నెలలో వేసవి సెలవలు ఇవ్వడం అనేది పరిపాటిగా జరుగుతుందని గుర్తు చేశారు.
పసిబిడ్డల శ్రేయస్సు దృష్ట్యా ఎప్పటినుండో ఉన్నటువంటి ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అనాలోచింతంగా తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు వలన విద్యార్థుల యొక్క ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని తెలిపారు. అధికారులు ఈ విషయం పై దృష్టి సారించి ఈ మండుటెండలో విద్యార్థులు ప్రాణాలు పణంగా పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తొందరూపాటు చర్య వలన విద్యార్ధులు, ఉపాధ్యాయులు జరిగే నష్టాన్ని గుర్తించి పాఠశాలకు త్వరితగతిన ఒంటిపూట బడులు, అనంతరం సకాలంలో వేసవి సెలవులు ఇచ్చి వేసవిలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇతర విద్యా సిబ్బంది. అవస్థలు పడి వడదెబ్బలకు గురై ప్రాణాలు కోల్పోకుండా వారిని ఆదుకోవాలని భారతీయ జనతా యువమోర్చా తరపున కోరారు.