ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడమె వలంటీర్లు లక్ష్యం
నెల్లూరు నగరం, ఏప్రిల్ 8 (సదా మీకోసం) :
నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమంలో కార్పొరేటర్ గోతం.అరుణ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ముందుగా వలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరాలి.సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లే ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలి.
మన డివిజన్లో పని చేస్తున్న ప్రతి వాలంటీర్ ను ప్రతి ఏటా ప్రోత్సాహించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సేవా వజ్ర,సేవా రత్న,సేవా మిత్ర పురస్కారాలు అందిస్తోందన్నారు.
ప్రతి ఒక వాలంటీర్ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించటమే ధ్యేయంగా పని చేయాలని సూచించారు.
కార్యక్రమంలో 11వ డివిజన్ సచివాలయం సిబ్బంది,వలంటీర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.