పల్లిపాడులో జిల్లాస్థాయి పాత్రపోషణ పోటీలు

పల్లిపాడులో జిల్లాస్థాయి పాత్రపోషణ పోటీలు
ఇందుకూరుపేట అక్టోబరు 29 (సదా మీకోసం)
మండలంలోని పల్లిపాడు గ్రామం జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణా సంస్థ నందు జిల్లాస్థాయి పాత్రపోషణ పోటీలు నిర్వహించారు.
పై కార్యక్రమానికి పరిశీలకులుగా యస్. సి. ఈ. ఆర్. టి. ప్రొఫెసరు శారదాదేవి విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లింగవివక్ష, భ్రూణ హత్యలు, డ్రగ్స్ దుర్వినియోగం, బాలికావిద్య అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించుట కొరకు ఇలాంటి పోటీలను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు.
లెక్చరర్లు డి.ఓబులేసు, డి.నరసింగరావు, ఐ.రాగమాలిని జడ్జీలుగా వ్యవహరించారు. ఈ పోటీలలో నాలుగు బృందాల విద్యార్థులు పాల్గొన్నారు.
దుత్తలూరు మండలం నందిపాడు కె. జి. బి. వి. విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
అనుమసముద్రంపేట మండలం గుడిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతిని, సూళ్లూరుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతిని చివరిగా ప్రోత్సాహక బహుమతిని నారాయణరెడ్డి పేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పొందారు.
ఈ కార్యక్రమంలో డైట్ కళాశాల గణిత ఉపన్యాసకులు బాలజీరావు, కళాశాల మీడియా ఇంఛార్జి విజయచంద్ర, వ్యాయామ అధ్యాపకులు దశరథరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.