అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్
అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారు : సాబీర్ ఖాన్
-: నెల్లూరు, జూన్ 26 (సదా మీకోసం) :-
నెల్లూరు నగర మైనారిటీ అధ్యక్షులు సాబీర్ ఖాన్ శనివారం నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సాబీర్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్కచెల్లెళ్ళ విషయంలో అవ్వా తాతల, ముస్లిం మైనారిటీ ల విషయం లో మాట మార్చారని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టించడానికి,ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి మైనారిటీ ల కోసం అనేక వరాలను కురిపించారనీ, కానీ జగన్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఈరోజుకి, ఒక సంక్షేమం కూడా అమలు కాలేదని ద్వజమెత్తారు.
జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీ లకు బడ్జెట్ ను కేటాయించినట్లుగా బహిరంగంగా చూపించి దొడ్డి దారి నుండి ఆ నిధులను మళ్లిస్తున్నాదని విమర్శించారు.
రాజశేఖర్ రెడ్డి మీద చిత్త శుద్ధితో మైనారిటీ లు ఏకపక్షంగా జగన్ ని గెలిపించారని, దాన్ని అలుసుగా చేసుకుని జగన్ మైనారిటీ లకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.
ఈ మధ్య కాలం లో రకరకాల జీవోలతో 1,11,74,11,800/- రూపాయలు మైనారిటీ నిధులను దారి మళ్లించారన్నారు.
మైనారిటీలు నోరు తెరిచి అడగలేరని అన్యాయం చేస్తున్నారు అని మండిపడ్డారు.
మన రాష్ట్రం లో ఆర్థికంగా వెనకబడింది చితికిపోయింది 95 శాతం మైనారిటీ లే నని, అలాంటిది వారి యొక్క నిధులను ఎలా మల్లిస్తారు అని ప్రశ్నించారు.
ఎవరికి వారికి విడిగా కార్పొరేషన్ లు కేటాయించినపుడు ముస్లిం ల నిధులు వేరే వాటికి ఉపయోగించాల్సిన అవసరం ఏం ఉందన్నారు.
ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని, మైనారిటీ లకు న్యాయం చేయాలని హితవు పలికారు, మైనారిటీ లకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని అన్నారు.
ఇప్పటికైనా వైసీపీ లో ఉండే ముస్లిం నాయకులు, ముస్లిం ల బాగోగుల కోసం శ్రమించాలని తెలిపారు.
ఈ సందర్భంగా జియా ఉల్ హక్ మాట్లాడుతూ.. ఎక్కువ శాతం ముస్లిం మైనారిటీ ల ఓట్ల తో గెలిచిన వైసీపీ ప్రభుత్వం నేడు రాష్ట్ర ముస్లిం మైనార్టీలకు తీరని అన్యాయం చేస్తుందని అన్నారు..
తెలుగుదేశం హయాంలో నేరుగా 50 వేల రూపాయలు పెళ్లికూతురు అకౌంట్ కి వేసే వాళ్ళు, అలా వేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందబాష్పాలు చూస్తే చాలా ఆనందం వేసేది అన్నారు.
కానీ ఇప్పుడున్న ఈ వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఏ ఒక్క సంక్షేమాన్ని కూడా అమలు చేయడం లేదని నూటికి నూరుశాతం రద్దు చేసి చోద్యం చూస్తున్నారని అన్నారు.
ముస్లింలకు రావాల్సిన సంక్షేమాన్ని రద్దు చేయడమే కాక ముస్లింలకు కేటాయించిన బడ్జెట్ ను కూడా దారి మరణిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.
ఈ తీరును మార్చుకోకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని తెలిపారు.
పై కార్యక్రమంలో మౌలానా అబ్దుల్ అజీజ్ ముజహీద్ డాక్టర్ కరిముల్లా సత్తార్ రబ్బానీ ఉమర్ ఎజాజ్ కలీమ్ హఫీజ్ వాజీద్ తదితరులు పాల్గొన్నారు.