హోమియో మందుల వితరణ
హోమియో మందుల వితరణ
వాకాడు, ఫిబ్రవరి 1 (సదా మీకోసం) :
కరోనా, ఒమెక్రాన్ నివారణకు, విషజ్వరాల నుండి సంరక్షణకు వాకాడు మండలం, బాలిరెడ్డిపాళెం లోని శ్రీరామ సేన ఆధ్వర్యంలో హోమియో మందుల వితరణ కార్యక్రమాన్ని వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూ మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్న శ్రీ రామ సేన యువకులను అభినందించారు.
15 సంవత్సరాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో మందుల అందజేయడం జరుగుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులకు, సచివాలయ సిబ్బందికి మందులను అందజేయడం అభినందనీయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు మందులను అందజేయడం జరుగుతుందని సి ఆర్ పి ప్రదీప్ తెలియజేశారు.
కార్యక్రమంలో రామ్ ఆలయ అర్చక స్వామి దీవి. అనంతాచార్యులు, ఉపాధ్యాయులు నాగరాజు అనురాధ , బాలిరెడ్డిపాళెం, జమీన్ కొత్తపాళెం సచివాలయ సిబ్బంది అశోక్ కుమార్ ,విశ్వ వీణ, స్వాతి, ఆనంద్ ,సాయి భరత్ రాజ్ కుమార్, శ్రీ రామ సేన యువకులు హరీష్ కుమార్ రెడ్డి, శివ కుమార్, గురు ప్రసాద్, గురుమూర్తి, రాజేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.