Spread the love

అఖిల ప‌క్షాల ర్యాలీ విజ‌య‌వంతం

జెన్కొ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా అఖిల ప‌క్షాల పిలుపు

ప్రజల హక్కులకు భవిష్యత్తుకు ఆటంకం కలిగించవద్దు

సోమిరెడ్డికి స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌

నెల్లూరు ప్ర‌తినిధి, మార్చి 17 (స‌దా మీకోసం) :

ఎన్ని ఆటంకాలు కలిగించిన కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టును అదాని కంపెనీకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయంపై నెల్లూరు జిల్లా ప్రజానీకంతో పాటు కార్మికులు తమ నిరసనను తెలియజేశారు.

ఈ సందర్భంగా కాసేపు నెల్లూరు విఆర్సి సెంటర్ లో పలువురు బైఠాయించారు. ఏపి జెన్ కో శ్రీ దామేదరం సంజీవయ్య ధర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ వైసిపి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల ప‌క్షాలు నిర్వ‌హించిన ర్యాలీకి మ‌ద్ద‌తుగా వేలాది మంది క‌ద‌లివ‌చ్చారు.

జెన్ కో ఉద్యోగులకు,కార్మికులకు తెలుగుదేశం, బి.జే.పి, కాంగ్రెస్‌, సిపియం, సిపిఐ, జనసేన త‌దిత‌ర పార్టీల‌తో పాటు కార్మిక సంఘాలు త‌మ పూర్తి మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భ‌గా నాయ‌కులు జెన్కో ప్రైవేటీకరణ పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణ‌య‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు.

 

 

జెన్ కో ఉద్యోగస్తుల నిరసన కు మద్దతుగా గురువారం రాజకీయాలకి అతీతంగా నిర్వ‌హించిన ర్యాలీకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడా ఉండ‌బ‌ట్టే ఇంతగా విజ‌య‌వంతం అయ్యింద‌ని నాయ‌ల‌కులు తెలిపారు. క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణం వ‌ర‌కు బారీ ప్ర‌ద‌ర్శ‌న‌గా వెళ్లినా జిల్లా కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు 20 మంది నేతలకు మాత్ర‌మే పోలీసులు అనుమతి మంజూరు చేశారు.

క‌లెక్ట‌ర్‌ని క‌ల‌సిన అఖిల ప‌క్ష నాయ‌కులు జిల్లా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలపాల‌ని, నెల్లూరు జిల్లాలో ఒకే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అయిన కృష్ణపట్నం ధర్మల్ ప్రాజెక్టు ఉందని, దానిని కూడా ప్రైవేటు పరం చేసి వేలాది మంది కార్మికుల, ప్రజల హక్కులకు భవిష్యత్తుకు ఆటంకం కలిగించవద్దుని కలెక్టర్ చక్రధర బాబు కు వినతి పత్రం అందించారు. గ‌తం కొంత కాలంగా నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరుపై ఆక్షేప‌ణ‌ల నేప‌థ్యంలో నేడు జ‌రిగిన ర్యాలీ విష‌యంలో కాని క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణం వ‌ద్ద కాని కొంత మార్పు క‌నిపించిద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

కృష్ణపట్నం ధర్మల్ ప్రాజెక్టు ప్రైవేటీకరణకు నిరసనగా అఖిలపక్ష రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నిరసన ప్రదర్శన శాంతియుతంగా నిర్వహించేలా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది.

 

 

నెల్లూరు కలెక్టరేట్ వద్ద అఖిలపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ముట్టడి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ మాట్లాడుతూ కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టును ప్రైవేటీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంద‌న్నారు.

కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టును అదానీ కంపెనీకి అప్పగించే కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్యాబినెట్ లో తీర్మానం చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల నిర్వీర్యమవుతున్నాయన్నారు.

కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టుపై వేలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందన్నారు.

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి థర్మల్ పవర్ ప్రాజెక్టులు వెళ్లడం వల్ల విద్యుత్ ఛార్జీలు కూడా భవిష్యత్తులో. భారీగా పెరుగుతాయన్నారు. కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టును కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

థర్మల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో స‌భ్యులు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురి అయి కుప్పకూలిపోయారు.

ఇది గ‌మ‌నించిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌నను హుటా హుటిన న‌గ‌రంలోని ఓ వైద్య‌శాల‌కు త‌ర‌లించి చికిత్స అందించారు.

అత్యవసర చికిత్స అనంతరం కోలుకున్న సోమిరెడ్డిని పూర్తిస్థాయి విశ్రాంతి కోసం అల్లిపురంలోని ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. ఆయ‌న‌న ప‌లువురు నాయ‌కులు ప‌రామ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!