శిశు గృహ, బాలసదనాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

శిశు గృహ, బాలసదనాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
చిన్నారులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలి
ఐసిడిఎస్ అధికారులను సూచించిన కలెక్టర్
నెల్లూరు నగరం, ఏప్రిల్ 18 (సదా మీకోసం) :
నగరంలోని ఐసిడిఎస్ కార్యాలయం సమీపంలో గల అనాధ బాలల సంరక్షణ కేంద్రం శిశు గృహ, బాలల సదనంను మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ సందర్శించారు.
శిశు గృహలోని చిన్నారుల యోగక్షేమాలను సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వంటశాలను తనిఖీ చేశారు.
చిన్నారులకు సకాలంలో పాలు, ఆహార పదార్థాలు అందించాలని, నిర్దేశించిన సమయంలోపు అన్ని వ్యాక్సిన్ లను వేయాలని సిబ్బందికి సూచించారు.
అలాగే బాలల సదనమును సందర్శించిన కలెక్టర్, అక్కడ మరుగుదొడ్లను, వంటశాల, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలు అందించాలని, ఎటువంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
కలెక్టర్ వెంట ఐసిడిఎస్ పిడి సౌజన్య, ఏసిడిపిఓ అనురాధ, డిసిపిఓ సురేష్, బాలల సంరక్షణ అధికారి సమత, మేనేజర్ లక్ష్మి, సూపరింటెండెంట్ లక్ష్మి తదితరులు ఉన్నారు.