శ్రీధర్ రెడ్డి కి దర్గాపై వైసీపీ రంగుల లైటింగ్ వేయడం రాజకీయం అనిపించలేదా : తెలుగుదేశం మైనారిటీ నాయ‌కులు హయత్ బాషా, సాబీర్ ఖాన్

0
Spread the love

శ్రీధర్ రెడ్డి కి దర్గాపై వైసీపీ రంగుల లైటింగ్ వేయడం రాజకీయం అనిపించలేదా

  • దర్గా పై వేసిన వైసీపీ రంగుల లైటింగ్ తొలగించి మల్టీ కలర్ లైటింగ్ వేయాలి
  • మొన్న రంగనాయకుల స్వామి దేవాలయానికి రంగులు వేశారు నేడు దర్గా పైన లైటింగ్ తో వేశారు
  • దర్గా పై ఉన్న వైసీపీ రంగుల లైటింగ్ తొలగించకపోతే పెద్ద ఎత్తున నిరసన చేస్తాం
  • పార్కింగ్ సౌకర్యం దూరంగా ఉన్నందున ప్రజలకు ఉచిత రవాణా ఏర్పాటు చేయాలి
  • ప్రభుత్వం వారు ఉచిత రవాణా ఏర్పాటు చేయకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఏర్పాటు చేస్తాం
  • తెలుగుదేశం మైనారిటీ నాయ‌కులు హయత్ బాషా, సాబీర్ ఖాన్

నెల్లూరు రూరల్, ఆగస్టు 6 (సదా మీకోసం):

నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న బారాషాహీద్ దర్గాలో జరుగు రొట్టెల పండుగలో భాగంగా దర్గాపై వైసీపీ రంగులతో కూడిన లైటింగ్ ను వేయడాన్ని నిరసిస్తూ, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు శనివారం రూరల్ నియోజకవర్గ టిడిపి మైనార్టీ నేతలు, నేతలు దర్గా ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. దర్గాపై పార్టీ రంగులతో కూడిన లైటింగ్ వేయడం, దర్గా తో రంగు రాజకీయాలు చేయడం దారుణమని, సిగ్గుచేటని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అనంతరం హయాత్ బాషా మీడియాతో మాట్లాడుతూ, కులమతాలకు పార్టీలకు వర్గాలకు అతీతంగా జరిగే ఈ రొట్టెల పండుగకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. అబ్దుల్ అజీజ్ మేయర్ గా, నారాయణ మంత్రి గా ఉన్నప్పుడు బారాషాహీద్ దర్గా లో ఎన్నో శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించారని గుర్తు చేశారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన భరాషాహీద్ దర్గాకు వైసీపీ రంగులతో అలంకరణ చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తపరిచారు.

టిడిపి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏ రోజు కూడా దర్గాకు పార్టీ రంగు పూయలేదని వివిధ రంగులతో అలంకరణ చేసే వారమని గుర్తు చేశారు. ముస్లిం లకు ఎటువంటి సంక్షేమాలు ఇవ్వని ఈ ప్రభుత్వం, ముస్లిం ల మేలు కోరని ఈ ప్రభుత్వం దర్గా కు వైసిపి రంగులు వేయడం ముస్లిం ల మనోభావాలు దెబ్బ తినే లా ఉన్నాయని అన్నారు.

వచ్చే భక్తుల కోసం ఈ సంవత్సరం పార్కింగ్ సౌకర్యం సరిగా కల్పించలేదని గత ప్రభుత్వంలో రొట్టెల పండుగ జరిగినప్పుడు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం పోలీస్ గ్రౌండ్లను పార్కింగ్ ఏరియాగా ఉపయోగించే వారమని ఈసారి అవి లేకపోవడంతో చాలా దూరంలో పార్కింగ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు.

పార్కింగ్ సౌకర్యం దూరంగా ఉండటంతో ప్రజలు భక్తులు అసౌకర్యానికి లోనవుతారని వారి కోసం ప్రభుత్వం తరఫున ఉచిత రవాణా ఏర్పాటు చేయాలని లేదంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఉచిత రవాణా ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు సేవ చేస్తామని తెలిపారు.

దర్గాలతో రాజకీయాలు చేయొద్దని మీ రాజకీయాలు రోడ్లమీద చేసుకోవాలని మీ రాజకీయ జెండాలు రోడ్లమీద ఉంచుకోవాలని, దర్గాలతో చర్చలతో మసీదులతో దేవాలయాలతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.

దర్గా పై వేసిన వైసిపి రంగుల లైటింగ్ తొలగించకపోతే రేపు పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని హెచ్చరించారు.

అనంతరం సాబీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, బయట జిల్లాల్లో వైసీపీ నాయకుల అత్యుత్సాహం ప్రదర్శించి వారి పార్టీ రంగులను దేవాలయాలకు వేస్తున్నారని, అది క్రమేణా నెల్లూరు వరకు పాకిందని తెలిపారు.

రంగనాయకుల స్వామి దేవాలయ శంకు చక్ర నామాలకు వైసీపీ రంగులను వేశారని తెలుగుదేశం పార్టీ పోరాటం చేయడంతో, రంగులు మార్చారని తెలిపారు.

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా అధికంగా ఉండటంతో బారాషాహీద్ దర్గాలో లేదని రొట్టెల పండుగ నిర్వహించలేదని, ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం వారు పండుగా నిర్వహిస్తున్నారు అని తెలిపారు.

దూరా భారాల నుంచి వచ్చేయాత్రికులకు మౌలిక సదుపాయాల పై వర్షపాతం నమోదు అయితే వారి బస గురించి, పారిశుధ్యం పై లా అండ్ ఆర్డర్ పై దృష్టి సారించకుండా, బారాషాహీద్ దర్గాకు వైసీపీ రంగులతో కూడిన లైటింగ్ను వేయడం దురదృష్టకర అంశంగా పరిగణించారు.

ఎన్నికల అప్పుడు మాత్రమే రాజకీయాలు పరిపాలనలో రాజకీయాలు చేయను అని చెప్పే శ్రీధర్ రెడ్డి గారికి ఇది కనపడలేదా ఇది రాజకీయంగా అనిపించలేదా అని ఎద్దేవా చేశారు.

దర్గాపై వేసిన వైసీపీ రంగుల లైటింగ్ ను తొలగించి వివిధ రంగులతో కూడిన మల్టీకలర్ లైటింగ్ నువ్వేయాలని లేదంటే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రంగు రాజకీయాలు చేయలేదని వైసిపి కూడా ఈ రంగు రాజకీయాలు మానేసి ప్రజలకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని కోరారు.

కార్యక్రమంలో జలదంకి సుధాకర్, కనపర్తి గంగాధర్, అల్లాబక్షు, అస్లామ్, ఆషిక్, రసూల్, కరిముళ్ళా, జాఫర్, సాజీద్, ఇలియాస్, సునీల్, మొఘల్ అస్లామ్, ఇజ్రాయేల్, శ్రీనాథ్, రమేష్ చౌదరి, సుబ్రహ్మణ్యం, శివ, మణికంఠ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!