త్రిశూల వ్యూహం ప్రయోగించిన టీడీపీ నేతలు…!
త్రిశూల వ్యూహం ప్రయోగించిన టీడీపీ నేతలు…!
టిడిపి నాయకులు రహదారుల పైకి వచ్చి ఆందోళన చేయకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బలగాలతో ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారని ఎలాగైనా నిరసన తెలపాలని అనుకున్న టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు సాబీర్ ఖాన్ త్రిశూల వ్యూహం ప్రయోగించారు..
నారా లోకేష్ గుంటూరు పర్యటన ను అడ్డుకునేందుకు నిరసనగా నెల్లూరు విఆర్సి వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ముందు జాగ్రత్త చర్యగా VRC సెంటర్ లో సిద్దంగా ఉన్న టిడిపి నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు…
అనంతరం త్రిశూల వ్యూహం ప్రకారం వేరే దారి నుంచి VRC సెంటర్ కు చేరుకున్న సాబీర్ ఖాన్ నిరసన కార్యక్రమం చేసి, ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు…
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని విమర్శిస్తూ నెల్లూరు విఆర్సి సెంటర్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న టిడిపి మైనార్టీ నగర అధ్యక్షుడు సాబీర్ ఖాన్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు..
ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్ర కార్యదర్శి జన్ని. రమణయ్య జిల్లా మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్, పార్లమెంట్ కార్యదర్శి కనపర్తి గంగాధర్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆషిక్ అలీ ఖాన్ తెలుగు యువత నగర అధ్యక్షుడు నాగేంద్ర టిఆర్ఎస్ నగర్ ప్రధాన కార్యదర్శి సుఖేష్ రెడ్డి, 30 వ డివిజన్ ఇన్చార్జ్ చెంచయ్య, 29 వ డివిజన్ ఇంచార్జి రమేష్ నాయుడు, 18 వ డివిజన్ ఇన్చార్జ్ మురళి, నగర నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జాఫర్, తెలుగు యువత నాయకులు అస్లాం రాజేష్ హజరత్ నవీన్ రబ్బాని 31వ డివిజన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు మహిళా నాయకులు మంగమ్మ ప్రమీల రావు లను అరెస్ట్ చేసి 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు..