మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి, ఆడబిడ్డల పై అత్యాచారాలు జరుగుతుంటే ఏం అయిపోయారు
మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి, ఆడబిడ్డల పై అత్యాచారాలు జరుగుతుంటే ఏం అయిపోయారు.
మంత్రి అనీల్ కు మహిళల పై చిత్తశుద్ధి ఉంటే తన అనుచరుడికి కఠిన శిక్ష వేయాలి.
పనబాక భూలక్ష్మి, నెల్లూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు
-: నెల్లూరు, మార్చి 27 (సదా మీకోసం) :-
నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో తెలుగుమహిళా విభాగం నాయకులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భూలక్ష్మి మాట్లాడుతూ, ఆడబిడ్డల తలపై ముద్దు పెట్టి మేనమామ మేనమామను అని చెప్పిన చదువు రెడ్డి ఈరోజు ఆడవారిపై దాడులు జరుగుతుంటే ఏమైపోయారు అని ప్రశ్నించారు.
వారంలో వెంకటగిరి లో వైసీపీ నాయకుడు ఒక అమ్మాయి గొంతు కోసారని, తన బిడ్డే టాపర్ గా ఉండాలని మానసిక ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యకు వైకాపా నేతలు కారణమయ్యారని మండిపడ్డారు.
ఆత్మకూరు లో 50 సంవత్సరాలు పైబడిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆడబిడ్డలపై దాడులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు 40 రోజుల నుంచి ఒక ఆడపిల్ల ను రూమ్ లో బంధించి అత్యాచారం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
మంత్రి అనిల్ కు మహిళలపై చిత్తశుద్ధి ఉంటే ఆడపిల్ల పై అత్యాచారానికి పాల్పడిన తన అనుచరుడు అనీల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నగర మహిళా అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ,
ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యచారాలు కంట్రోల్ చేయకుండా దిశ యాప్ లతో దిశ చట్టాలతో ఎవరిని ఉద్దరిస్తారు అని ప్రశ్నించారు.
వైకాపా మహిళా ఎమ్మెల్యే రోజా శాసనసభ సాక్షిగా ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే నీ కంటే ముందు జగన్ వస్తారు అని చెప్పారు అని జగన్ కాదు కదా కనీసం గన్నుతో కూడా న్యాయం జరగడం లేదని అన్నారు.
వైకాపా ప్రభుత్వ ఏర్పడినప్పటి నుంచి ఆడపిల్ల పై ఎన్నో హత్యలు అత్యాచారాలు జరిగాయని వైకాపా లో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు గా కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు.
పై కార్యక్రమంలో గోడా పద్మ, వనజా రెడ్డి, సుశీలమ్మ, శ్రీదేవి, సోనీ తదితరులు పాల్గొన్నారు…