కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక.. టీడీపీ అభ్యర్దులపై దాడులా..? : తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి ఆగ్రహం
కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక.. టీడీపీ అభ్యర్దులపై దాడులా..?
తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి ఆగ్రహం
- మా అభ్యర్దులను చూసి మంత్రి అనీల్ ప్యాంట్ తడుపుకుంటున్నాడు..
- అధికార మదంతో, గర్వం నెత్తికెక్కి.. టీడీపీ అభ్యర్దుల ఆస్తులపై దాడులు చేస్తున్నాడు..
- జిప్ బాబా.. వీధి రౌడీలా ప్రవర్తించకు.. రాజకీయాల్లో గెలుపోటములు సహజం… చీప్ క్యారెక్టర్ ను బయటపెట్టుకోకు..
- నెల్లూరు సిటీలో మంత్రి అనీల్ అగడాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీసిటీఇన్చార్జి కోటంరెడ్డి..
- తన అభ్యర్దులను ఇబ్బంది పెట్టాలంటే.. తనను దాటుకుని వెళ్లాలని రోడ్డుమీద పడుకున్న సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి..
- నీ చెంచా పనులు మా దగ్గర చెయ్యొద్దని కోటంరెడ్డి హెచ్చరిక
- సిటీ నియోజకవర్గమంతా ఇలాంటి బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయి..
- అధికారంలో ఉన్నా..ఓడిపోతామనే భయం అనీల్ ను వెంటాడుతోంది.
- అధికార మదంతో అభ్యర్దులను ఇబ్బంది పెడుతున్నాడు..
-: నెల్లూరు నగరం, అక్టోబర్ 30 (సదా మీకోసం) :-
నెల్లూరు నగర పాలకసంస్థ లో ఎన్నికలు నిర్విహించేందుకు అధికారులు సిద్దమవుతుండగా, అధికార, ప్రతి పక్షాలు తమ అభ్యర్ధులను సిద్దం చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సిటి నియోజయవర్గ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎన్టీఆర్ నగర్‌లో తెదేపా తరపున పోటీనిలబెడుతున్న అభ్యర్దిని బెదిరిస్తున్నారంటూ నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే దమ్ము దైర్యం లేక మంత్రి అనీల్ వీధి రౌడీలా టీడీపీ కార్యకర్తల ఆస్తులపై దాడులు చేయిస్తున్నాడన్నారు.
ఎన్టీయార్ నగర్ లో గత రాత్రి టీడీపీ తరపున అభ్యర్దిని నిలబెడితే ఉదయాన్ని కార్పొరేషన్ అధికారులను 30 మంది పంపి అతన్ని బెదిరిస్తున్నాడని తెలిపారు.
తనకు సమాచారం వచ్చిన వెంటనే అక్కడి వెళ్లానని, దీంతో కార్పొరేషన్ అధికారులు కొందరు జారుకున్నారని, తాను రోడ్డుమీద పడుకుని నిరసన వ్యక్తం చేశానని తెలిపారు.
కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలంటే.. నన్ను దాటుకునివెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతోవారంతా వెళ్లిపోయారని, క్యాటరింగ్ పై దాడులు చేయిస్తున్నారని, మేం ఎక్కడ అభ్యర్దులను నిలబెట్టినా.. వైసీపీ అభ్యర్దులు ఓడిపోతారనే భయంతో సిగ్గులేకుండా వారిపై బెదిరింపులకు దిగుతున్నాడని విమర్శించారు.
మంత్రి అనీల్ కు దమ్ము, దైర్యం ఉంటే.. నిఖార్సైన రాజకీయాలు చెయ్యాలి తప్ప.. ఇలాంటి రాజకీయాలు తగవని, అధికార మదం, గర్వం నెత్తికెక్కితే వీధి రౌడీల్లా ప్రవర్తిస్తారడానికి మంత్రి అనీల్ చేష్టలే నిదర్శనం అన్నారు.
దమ్ముంటే ప్రజాస్వామ్యబద్దంగా జరిగే ఎన్నికల్లో గెలవాలి తప్ప.. ఇలాంటి బెదిరింపులకు దిగడం సరికాదు.. ఒక్క ఎన్టీయార్ నగర్ మాత్రమే కాదు.. సిటీ నియోకవర్గంలోని అన్నిడివిజన్లలో ఇలాంటి బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
కానీ మా వాళ్లు దైర్యంగా ఎదుర్కొంటున్నారు.. మేం అధికారంలో ఉన్నప్పుడు నీలాగా చేసుకుంటే.. నువ్వు, నీ చెంచాలు కార్పొరేషన్లో అడుగు కూడా పెట్టేవాళ్లు కాదు.. గుర్తుపెట్టుకో.. మా అభ్యర్దుల జోలికి వస్తే.. నీ భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్నారు.
మా అభ్యర్ది క్యాటరింగ్ నిర్వహిస్తుంటే.. కార్పొరేషన్ అధికారులు తనిఖీలంటూ వారి ఇళ్లపై దాడులు చేస్తారా..? నోటికొచ్చినట్లు బూతులుతిడతారా..? అని ప్రశ్నించారు.
మంత్రి అనీల్ కు, అతనికి సహకరిస్తున్న అధికారులకు ఒక్కటే వార్నింగ్.. మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం.. ఏ ఒక్కరిని వదలను.. గుర్తు పెట్టుకో.. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నావ్ అనీల్.. అంటూ వ్యాఖ్యానించారు.