పంటకు గిట్టుబాటు ధరలు అందించాలి : ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్
పంటకు గిట్టుబాటు ధరలు అందించాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్
గూడూరు , మార్చి 17 (సదా మీకోసం) :
గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో మాజీ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
న్యూ జాబ్ క్యాలండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖల లోని ఖాళీలను వెంటనే భర్తీ చేసే విదముగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. జంగారెడ్డి గూడెం నందు కల్తి మద్యంతో చనిపోయిన కుటుంభాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షలు అందించాలని పేర్కొన్నారు. పెంచిన ఇంటిపన్ను, చెత్త పన్ను ను రద్దు చేయాలని, ప్రభుత్వం నిర్మిస్తున్న కాలనీల కొరకు పేదల నుండి అదనంగా వసూలు చేస్తున్న 30 వేలు రూపాయులను వసూలు చేయకూడదని తెలిపారు.
మార్చి 19న నెల్లూరు లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగే మత్స్యకారుల ఘోష నిరసన కార్యక్రమంను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో పడగొట్టిన టవర్ క్లాక్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. వ్యాపారస్తుల కోసం నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ ను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నెల గ్రామ, వార్డు, మండల నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి పంచాయతి, వార్డు ల నందు గౌరవ సభలు ఏర్పాటు చేయాలని అన్నారు.