ప్రజలపై మోపే భారాలకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను విజయవంతం చేయండి
- ప్రజలపై భారాలు మోపే మున్సిపల్ చట్ట సవరణ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.
- జూన్ 30 తేదీన కార్పొరేషన్ ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలి.
- మాదాల వెంకటేశ్వర్లు (సింహపురి పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్)
-: నెల్లూరు రూరల్, జూన్ 28 (సదా మీకోసం) :-
సింహపురి పౌర సమైక్య నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ సంస్కరణలు రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఉమ్మారెడ్డి గుంట సెంటర్ నందు ప్రజా బ్యాలెట్ ద్వారా అభిప్రాయ సేకరణ ప్రజల సంతకాల సేకరణ నిర్వహించడం జరిగినది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సింహపురి పౌర సమాఖ్య నెల్లూరు జిల్లా కన్వీనర మాదాల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ…. నెల్లూరు జిల్లాలోని కార్పొరేషన్ అన్ని మున్సిపాలిటీలు పరిధిలో కష్టంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇంటి పన్నుల భారాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఖజానా నింపుకోవడమే పరమ విధిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం ప్రజల బాధలను సమస్యలను గాలికొదిలేసి ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడడం చూస్తుంటే ప్రజల పై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అని అన్నారు.
స్థానిక సంస్థలకు నిధులు అధికారులు బదలాయించి బలోపేతం చేయాలన్న భారత రాజ్యాంగం యొక్క ఆదేశాలను తుంగలో తొక్కి పౌరులకు అందించే ప్రతి సేవలకు డబ్బులు వసూలు చేయాలన్న విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం దురదృష్టకరమని అన్నారు.
సింహపురిపౌర సమాఖ్య రూరల్ కార్యదర్శి కిన్నెర కుమార్ మాట్లాడుతూ… బ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరణలో రెండు వేల మంది స్వచ్ఛందంగా పాల్గొని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు.
నెల్లూరు రూరల్ కార్పొరేషన్ పరిధిలోని 27 డివిజన్లలో, ఇంటింటి కి కరపత్రం తొప్రచార కార్యక్రమం, సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామని అన్నారు.
జూన్ 30వ తేదీన నెల్లూరు కార్పొరేషన్ ఆఫీస్ వద్ద జరుగు నిరసన కార్యక్రమాన్ని ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరినారు.
కార్యక్రమంలో సింహపురి పౌర సమాఖ్య నెల్లూరు రూరల్ కమిటీ సభ్యులు, ఎస్ కే జిలాని, తూ పల్లి ప్రభాకర్, ఎస్ కే నజీర్, నరసింహారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, పోతురాజు శ్రీనివాసులు, మోహన్, డబ్బు గుంట శ్రీనివాసులు, గోపి, మణి, అయోధ్య, కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.