ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు : కలెక్టర్ చక్రధర్ బాబు

ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు : కలెక్టర్ చక్రధర్ బాబు
-: నెల్లూరు రూరల్, ఆగస్టు 3 (సదా మీకోసం) :-
నెల్లూరులోని కొండాయపాలెం వద్ద నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్తు సబ్ స్టేషన్ ని.., సోమవారం ఉదయం కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ఎమ్మెల్యే కె.శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి.., విద్యుత్తు శాఖకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని.., గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఏడాది కాలంలోనే సుమారు 2,000 కోట్ల రూపాయలతో విద్యుత్తు శాఖలో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు.
ప్రతిరోజూ ఉదయం 6 గం. నుంచి వరుసగా ఎలాంటి అంతరాయం లేకుండా 9 గం. పాటు ఉచిత విద్యుత్తుని అందిస్తూ.., రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
ఆక్వా రంగానికి కూడా యూనిట్ విద్యుత్తు రూ. 1.50 పైసలు అందిస్తోందన్నారు.
కోవిడ్-19 మహమ్మారి ఉన్న సమయంలో కూడా ఆస్పత్రులకు, కోవిడ్ కేర్ సెంటర్స్, గృహాలకు 24 గం. విద్యుత్తు అందిస్తూ.., విద్యుత్తు శాఖ ఉద్యోగులు ఎంతో శ్రమిస్తున్నారని కలెక్టర్ అభినందించారు.
ఈ పర్యటనలో వైసీపీ నాయకులు కె.గిరిధర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.