బాధ్యతలు స్వీకరించిన నూతన కమిషనర్ జాహ్నవి
బాధ్యతలు స్వీకరించిన నూతన కమిషనర్ జాహ్నవి
నెల్లూరు కార్పొరేషన్, ఏప్రిల్ 4 (సదా మీకోసం) :
నెల్లూరు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా ఎమ్.జాహ్నవి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షించి నగరాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
సాధారణ బదిలీల్లో భాగంగా నెల్లూరు నగర కమిషనర్ గా ఉన్న దినేష్ కుమార్ ను సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
నెల్లూరు జిల్లా (హౌసింగ్ ) జాయింట్ కలెక్టర్ గా ఉన్న జాహ్నవి ని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా బదిలీ చేశారు.
కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కార్పొరేషన్ ఈఈ, డిఈలు కలిసి పుష్పగుచ్చం అందజేశారు.