సకల మానవాళి మనుగడకు పరిశుద్ధమైన నీరు అందించాలి
సకల మానవాళి మనుగడకు పరిశుద్ధమైన నీరు అందించాలి
బద్దెపూడి నరసింహ గిరి
నెల్లూరు, మార్చి 22 (సదా మీకోసం) :
ప్రపంచంలో సకల జీవరాశికి నీరు హక్కు, అదే జీవితం. సకల మానవాళికి పరిశుద్ధమైన నీరు అందించేందుకు ఐక్యరాజ్య సమితి మార్చి ఇరవై రెండువ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్ణయించారని 25 వ డివిజన్ కార్పొరేటర్ బద్దెపూడి నరసింహ గిరి అన్నారు.
మంగళవారం ప్రపంచ జల దినోత్సవం (వరల్డ్ వాటర్ డే) సందర్భంగా బుజ బుజ నెల్లూరులోని పీఎంపీ కార్యాలయంలో యూనిసెఫ్, ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడుతూ శుద్ధి చేసిన నీరును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రకృతి నుంచి సహజంగా వచ్చే జలాలను సద్వినియోగం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లో, పొలంలో పనిచేసే రైతులు అదే నీరు తాగేవారని, ప్రస్తుతం బాటిల్ అందుబాటులో ఉన్ననీరు అది స్వచ్ఛమైన నీరుఅనే నిర్ధారణ చేయలేమన్నారు.
ముఖ్యంగా సిరియా ఇతర దేశాల్లో పరిశుద్ధమైన నీరు అందక చిన్నారులు రోగాల బారిన పడుతున్నారన్నారు.
ఇలాంటి వారిని కాపాడేందుకు ఐక్యరాజ్యసమితి, స్వచ్ఛంద సంస్థలు పరిశుద్ధమైన నీరు అందించేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.
నదుల పరీవాహక ప్రాంతంలేని ప్రాంతాల్లో చెరువులు నిర్మించి, నీటిని నిల్వచేసే సంప్రదాయం మన దేశంలో ఉండేదన్నారు.
ఆక్రమణలు పెరగడంతో చెరువులు చాలావరకూ ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇంకుడుగుంటల ద్వారాకూడా నీరు నిల్వచేసి అవసరానికి వినియోగించు కోవచ్చన్నారు.
గాలి నీరు సకల జీవరాశికి జీవన ప్రమాణం పెంచుతుందని, రోగాలను నిరోధిస్తుందని అన్నారు.
జిల్లా పీఎంపీ గౌరవాద్యకులు అనుముల జయప్రకాష్ మాట్లాడుతూ వాతావరణాన్ని, నీటిని కాలుష్యం చేసే పరిశ్రమలనుండి వచ్చే వ్యర్థ పదార్థాలను నిరోధించేందుకు కఠినమైన చట్టాలు అవసరమన్నారు.
జల దినోత్సవం సందర్బంగా జీవరాశులన్నిటికి స్వచ్ఛమైన నీరు అందించేందుకు ప్రయత్నిస్తామని ప్రతిఒక్కరూ ప్రతినబూనాలని ఆయన కోరారు.
ఆహారం లేకున్నా నీటితో జీవించే జీవరాసులు ఉన్నది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమములో తొలుత పీఎంపీ నాయకుడు గాదె యోగేంద్ర కుమార్ ఆకాలమరణానికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు.
ఈ కార్యక్రమములో, జిల్లా పీఎంపీ అధ్యక్ష కార్యదర్సులు శాఖవరపు వేణుగోపాల్, షేక్ సత్తార్, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, జిల్లా పీఎంపీ నాయకులు జి.శేషయ్య, డి. శ్రీనివాసులు, సి.వీరయ్య, యన్.ప్రసాద్, వి.వేంకటేశ్వర్లు రెడ్డి, డి.సుధాకర్, సి.సాయి మురళి, యస్ మధుసూదన్ రావు, యస్ నాగరాజు, యస్.రాము, షేక్ మునవర్ పాల్గొన్నారు.