కరోనా ఉధృతి తట్టుకునేందుకు 15వేల పడకలు సిద్దం చేయండి
సిపియం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్
-: నెల్లూరు, ఆగస్టు 8 (సదా మీకోసం) :-
జిల్లాలో రోజు రోజుకు కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా సీపీఎం జిల్లా కమిటీ నెల్లూరు రూరల్ కమిటీ, నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం బృందం కోవిద్ రీజనల్ ఆస్పత్రి ని సందర్శించడం జరిగింది.
ఈ బృందం అక్కడ కోవిద్ పేషెంట్స్ కి అందుతున్న వైద్య సేవలు, వారికి ఉన్న సౌకర్యాల గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి నుంచి వివరాలు సేకరించారు.
ఈ బృందానికి నాయకత్వం వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా లా కరోనా విజృంభిస్తున్నదని, కరోనా వ్యాధి రోగులకు సరైన వైద్యం అందించేందుకు కనీసం 15000 పడకల ను ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన డాక్టర్ లు, ఇతర వైద్య సిబ్బంది ని ఏర్పాటు చేయాలని కోరారు.
రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా పేషెంట్స్ కి పౌష్టికాహారం అందించడంలో లోపం ఉన్నట్లు వార్త కధనాలు వస్తున్నాయి అని వెంటనే అధికారులు స్పందించి నాణ్యమైన ఆహారాన్ని సకాలంలో అందించాలని కోరారు.
సీపీఎం నెల్లూరు నగర కార్యదర్శి మూలం రమేశ్ మాట్లాడుతూ టెస్ట్ ల ఫలితాలు ఇవ్వడం లో విపరీతమైన జాప్యం జరుగుతోందని, దీనిని నివారించాలని, అలాగే విస్తృతంగా టెస్ట్ లు నిర్వహించాలని కోరారు.
జిల్లా కమిటీ సభ్యులు అల్లాడి గోపాల్ మాట్లాడుతూ కరోనా సేవలు అందించేందుకు యువత సిద్ధంగా ఉందని, అవసరం అయిన చోట్ల ఉపయోగించుకోవాలని కోరారు.
నెల్లూరు రూరల్ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు సభ్యులు బి కృష్ణయ్య మాట్లాడుతూ డాక్టర్లు కి, వైద్య సిబ్బందికి, వాలంటీర్ల కు, సచివాలయం సిబ్బంది, ఆశాలు, అంగన్వాడీ లు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని, వారికి అవసరమైన రక్షణ పరికరాలు అందించాలని కోరారు.
నెల్లూరు రూరల్ కమిటీ సభ్యులు డి. సంపత్ కుమార్ మాట్లాడుతూ నగరంలో ని ప్రైవేటు వైద్యుల, వైద్యశాలలని ప్రభుత్వ నియంత్రణ లోకి తీసుకొని కరోనా సేవలు, ఇతర అత్యవసర వైద్య సేవలు ఉచితం గా ప్రజలకు అందించేలా చూడాలని కోరారు.
నెల్లూరు రూరల్ కమిటీ సభ్యులు కిన్నెర కుమార్ మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళన లో ఉన్నారని వారికి అవసరమైన మానసిక వైద్య సేవలు అందించాలని కోరారు.
అనంతరం జిజిహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో రూరల్ కమిటీ సభ్యులు శంషాబాద్, సింహగిరి , భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.