నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా పల్నాటి నాగేశ్వరరావు చిరస్థాయిగా నిలిచిపోతారు
నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా పల్నాటి నాగేశ్వరరావు చిరస్థాయిగా నిలిచిపోతాడు
నాలుగో వర్ధంతి సభలో పలువురు జర్నలిస్టులు
ఒంగోలు, అక్టోబర్ 18 (సదా మీకోసం):
సామాజిక కార్యకర్తగా, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా పల్నాటి నాగేశ్వరరావు చిరస్థాయిగా నిలిచిపోతాడని పలువురు జర్నలిస్టులు కొనియాడారు.
సామాజిక కార్యకర్త జర్నలిస్టు పల్నాటి నాగేశ్వరరావు నాలుగవ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పల్నాటి నాగేశ్వరరావు తో ఉన్న అనుబంధాన్ని పలువురు జర్నలిస్ట్ లు నెమరు వేసుకున్నారు.
సేవా కార్యక్రమాలలోనూ, ఉద్యమాలలోను, జర్నలిజం లోను పల్నాటి నాగేశ్వరరావు ప్రత్యేకంగా కనపడే వారన్నారు.
సేవా కార్యక్రమాల్లో ముందుండే పల్నాటి ఆకస్మికంగా అనారోగ్యంతో మరణించడం స్నేహితులకు, జర్నలిస్టులకు తీరని లోటు అని అన్నారు.
కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏ.పీ.ఈ.జె.యు.) రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి సంధానకర్తగా, రాష్ట్ర కో కన్వీనర్ గట్టుపల్లి శివకుమార్ సభ అధ్యక్షులుగా వ్యవహరించారు.
ఏ.పీ.ఈ.జె.యు. ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు మల్లేశ్వరి అతిధులను ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఏ.పీ.ఈ.జె.యు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఉడతా రామకృష్ణ, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ప్రకాశం అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు అలుగుల సురేష్, టీవీ5 జనార్ధన్, పి 9 కిరణ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మీసాల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు వెంకట్రావు, నూకతోటి శరత్ బాబు, పొన్నూరి శ్రీనివాసులు ఇత్తేకర్ భాష, వార్త నాగేశ్వరరావు, బొడ్డు శ్రీను, రేణు బాబు, జోగి శ్రీనివాసులు, పూజల శ్రీనివాసరావు వరప్రసాద్, గౌస్ భాషా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.