మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం త్వరగా సిద్ధం చేయండి
మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం త్వరగా సిద్ధం చేయండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ చక్రధర్ బాబు
-: నెల్లూరు కలెక్టరేట్, జూన్ 28 (సదా మీకోసం) :-
సెట్నల్, ఆర్ & బి అధికారులతో నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు సమీక్షా, సమావేశం నిర్వహించారు.
మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం పనులు ఎంత వరకూ వచ్చాయి? పెండింగ్ పనులు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని ఎప్పటిలోపు పూర్తికేచేస్తారు? అనే వివరాలను కలెక్టర్, అధికారులను అడిగి తెలుసుకున్నారు.
స్టేడియం ప్రారంభోత్సవానికి త్వరితగతిన సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇండోర్ స్టేడియం మ్యాప్ ని పరిశీలించిన కలెక్టర్.., కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని.., సెక్యూరిటీ సిబ్బందిని నియమించి తగిన భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో సెట్నల్ ఇంఛార్జి సి.ఈ.ఓ రోజ్ మాండ్, ఆర్.డి.ఓ హుస్సేన్ సాహెబ్, శాప్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.