నమ్మించి అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులతో పాటు, యావత్తు ఆంధ్రుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే : కాకర్ల తిరుమల నాయుడు
నమ్మించి అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులతో పాటు, యావత్తు ఆంధ్రుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే : కాకర్ల తిరుమల నాయుడు
-: నెల్లూరు నగరం, ఆగస్టు 5 (సదా మీకోసం) :-
తెలుగు యువత నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ కాకర్ల తిరుమల నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్సి సెంటర్ వద్ద గల అంబేద్కర్ బొమ్మ ఎదుట, మూడు రాజధానుల బిల్లు పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా కాకర్ల తిరుమల నాయుడు మాట్లాడుతూ….. మాట మార్చడం..మడమ తిప్పడం… ఎన్నికల తర్వాత మాట మార్చడం…. ఏరు దాటాక తెప్ప తగలేయడం ముఖ్యమంత్రికి పుట్టుకతో అబ్బిన లక్షణాలని నెల్లూరు పార్లమెంట్ తెలుగు యువత కో ఆర్డినేటర్ కాకర్ల తిరుమల నాయుడు అన్నారు.
రాష్ట్ర భవిష్యత్తుకు, రాజధాని అమరావతి కు ఊపిరి పోస్తూ మూడు రాజధానుల బిల్లు పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమన్నారు.
అమరావతి ని రాజధాని గా కొనసాగిస్తామని, మార్చబోమని ఎన్నికల ప్రచారంలో నమ్మించి అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులతో పాటు, యావత్తు ఆంధ్రుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు.
రాజధాని మార్చాలన్న కుట్ర ను ఎన్నికల ప్రచారం లో ఎందుకు దాచి పెట్టారనీ, అమరావతిలో సొంత ఇల్లు, వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మించి ప్రజలను ఎందుకు మభ్య పెట్టారని ప్రశ్నించారు.
కరోనా విపత్కర పరిస్థితులలోనూ పట్టు సడల కుండా 225 రోజుల పాటు దీక్షలు చేపట్టిన రాజధాని రైతులపై ముఖ్యమంత్రి గారికి కనికరం కలగలేదా ? ఇదేనా మీరు తెస్తామని చెప్పిన రైతు సంక్షేమ ప్రభుత్వం ? అని ప్రశ్నించారు.
కర్నూలు లో న్యాయ రాజధాని ఏర్పాటు సాధ్యమేనా ! సాధ్యాసాధ్యాలు తెలిసికూడా కర్నూల్ వాసులను రాజధాని పేరిట మభ్య పెట్టడం సమంజసమా ? అన్నారు.
రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అవినీతి, కరోన నిర్మూలన లు ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి గారు నాటకాలు ఆడుతున్నారన్నారు.
మూడు రాజధానుల పేరిట మరో మూడేళ్లు కాలయాపన చేసి శాశ్వత రాజధాని, శాశ్వత కట్టడాలు లేకుండా రాష్ట్ర భవిష్యత్తును నిర్వీర్యం చేయాలని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారన్నారు.
కరోనా విపత్కర పరిస్థితులను అనువుగా మార్చుకుని 3 రాజధానుల బిల్లు ను ఆమోదించు కోవడం ముఖ్యమంత్రి గారి నీచ రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ తలతిక్క నిర్ణయాల పై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పట్టీ పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్మింపతలపెట్టిన రాజధాని అమరావతి ను మేమెందుకు కొనసాగించాలన్న అహం ను ముఖ్యమంత్రి వీడాలన్నారు.
రాజధాని అమరావతి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకం కాదు…. ఇష్టం వచ్చినట్లు మార్చేందుకు ! అమరావతి అంటే ఆంధ్రుల రాజధాని కలల రూపం, తెలుగు ప్రజల భవిష్యత్తు అని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాల బారి నుంచి రాష్ట్ర భవిష్యత్తును రక్షించుకునేందుకు ఇక న్యాయ స్థానాలే దిక్కన్నారు.