దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా సర్వేపల్లి నియోజకవర్గం..అవినీతి ఎల్లలు దాటిపోయింది : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

0
Spread the love

దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా సర్వేపల్లి నియోజకవర్గం..అవినీతి ఎల్లలు దాటిపోయింది

  • రోజూ సాయంత్రం కోటి రూపాయలను చూడనిదే ఎమ్మెల్యేకి నిద్రపట్టడం లేదంట.
  • ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు భక్షకులుగా తయారయ్యారు
  • వైసీపీ నేతల కక్షసాధింపుల కోసం దళిత, గిరిజన మహిళల ఆత్మగౌరవాలను బజారులో పెట్టడం బాధాకరం
  • సర్వేపల్లి నియోజకవర్గంలో యువత ఎంతో యాక్టీవ్ గా ఉంది..అక్రమాలు, అరాచకాలపై పోరాట బాధ్యత కూడా యువతదే
  • మనుబోలులో సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు యువత కార్యవర్గ ప్రకటన కార్యక్రమంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కంటేపల్లి అటవీ భూముల్లో గ్రావెల్ తవ్వేస్తున్న 4 హిటాచీలు, 19 టిప్పర్లను పట్టుకున్నారు. వాటికి చట్టప్రకారం కోటి రూపాయలు పైన్ వేయాల్సింది రూ.4 లక్షలు వేసి వదిలేశారు.

గ్రావెల్ టిప్పర్ల కారణంగా కరెంట్ తీగలు దళితుల ఇంటిపై పడితే మాఫియాను వదిలేసి నిరసన తెలిపిన మహిళలు, పిల్లలకు పాలిస్తున్న తల్లులను నైటీలలో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

అదే పెద్ద కుటుంబాలకు చెందిన మహిళలను అయితే నైటీల్లో ఉండగానే స్టేషన్ కి తీసుకెళ్లే దమ్ము పోలీసులకి ఉందా..

దళితుల ప్రాణాలమీదకు వచ్చిన ఘటనకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ లో పెట్టే ధైర్యం పోలీసులకు ఉందా..

సర్వేపల్లి రిజర్వాయరులో గ్రావెల్ దోపిడీ యథేచ్చగా జరిగింది. గ్రావెల్ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన ఫొటోలను జీపీఎస్ లొకేషన్ తో సహా తీసి పంపినా ఈ రోజుకీ ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు.

ఎం.శ్రీనివాసులు రెడ్డి ఎవరో ఈ రోజుకీ అధికారులు తేల్చలేకపోయారు.

అనుమతుల పేరుతో రిజర్వాయరులో జరిగిన అక్రమాలను బయటపెట్టడానికి వెళ్లిన టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు బనాయించారు..

పట్టపగలు రిజర్వాయరులో కొలతలు వేస్తున్న టీడీపీ నాయకులపై వంద మందితో వచ్చి వైసీపీ నాయకులు దౌర్జన్యం చేయడమే గాక, గిరిజన మహిళా సర్పంచ్ తో అసభ్యంగా ప్రవర్తించారని ఆమెతో బలవంతంగా కేసు పెట్టిస్తారా..

అక్రమాలను ప్రశ్నిస్తే టీడీపీ నాయకులపైనే కాదు ఓట్లేసి గెలిపించిన ప్రజలపైనా అక్రమ కేసులు పెట్టే స్థాయికి దిగజారిపోయారు..

నేదురుమల్లిలోనూ ఓ కుటుంబ వివాదం రేగితే నవవధువుతో ఆమె బావపైనే కేసు పెట్టిస్తారా..

మీ కక్షసాధింపుల కోసం దళితులు, గిరిజన మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా

కృష్ణపట్నం పోర్టు రోడ్డులో ఒక్కొక్క లారీ వద్ద వెయ్యి నుంచి రూ.1500 దండుతూ ప్రతి నెలా కోట్లకు కోట్లు దోచుకుంటున్నారు.

ఎందుకు చెల్లించాలని ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులే వారి లారీలను స్టేషన్ కు తీసుకెళ్లి బెదిరించడం దుర్మార్గాలకు పరాకాష్ట.

సర్వేపల్లిలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు.సాయంత్రానికి కోటి రూపాయలు చూడనిదే కాకాణికి పట్టడం లేదు.

యువత టెక్నాలజీని, సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోండి..అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు చేయండి

పరిధి దాటి వ్యవహరిస్తున్న పోలీసుల ఆగడాలను ఆధారాలతో సహా ప్రజల ముందు పెడదాం..

చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసుల ఆటలను ఇక సాగనీయబోము

మన హక్కులు కాపాడుకోవడం కోసం యువత ముందుకొచ్చి పోరాడాలి

 

 

తెలుగుదేశం వార్తలకోసం క్లిక్ చేయండి

 

 

 

తెలుగుదేశం వార్తలకోసం క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!