వరద బాధితులకు భోజన పంపిణీ చేసిన అబ్దుల్ అజీజ్, జెడ్ శివ ప్రసాద్
నెల్లూరు, నవంబర్ 20 (సదా మీకోసం) :
నెల్లూరు లోని 1 వ డివిజన్ లోని దొరతోపు కాలనీలో శనివారం రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డా. జెడ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో భోజన పంపిణీ నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పాల్గొని భోజనం పంపిణీ చేశారు.
మొదట వెంకటేశ్వర పూరంలోని బాధితులను పరామర్శించి భోజనం పంపిణీ చేశారు. అనంతరం దోరతోపు కాలనీలో పర్యటించి, నది ప్రవాహక ప్రాంతాల్లో నీట మునిగిన వారిని పరామర్శించి, పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి భోజనం పంపిణీ చేశారు. అనంతరం నది ఒడ్డున నివసిస్తున్న నివాసులకు భోజనాన్ని పంపిణీ చేశారు.
వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, తిరుమల నాయుడు, కనపర్తి గంగాధర్, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, డా. మేకల వంశీ కృష్ణా యాదవ్, కేశవా, స్థానిక నాయకులు జావీద్, షాహల్ తదితరులు పాల్గొన్నారు.