లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి

లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి
నెల్లూరు ప్రతినిధి, ఆగష్టు 7 (సదా మీకోసం) :
కార్మిక చట్టాలను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన నూతన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని ఏపీ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ ఏ.వి. నాగేశ్వరరావు గారు డిమాండ్ చేశారు.
సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు టీ.వి. వి. ప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నందు” కార్మిక చట్టాల సవరణ -కార్మికుల పై ప్రభావం” అంశంపై సదస్సు నిర్వహించడమైనది.
ఈ సదస్సులో పాల్గొన్న ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నూతనంగా నాలుగు లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిందని, ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల పోరాడి సాధించుకున్న హక్కులు చట్టాలు రద్దు అవుతున్నాయని తెలిపారు.
కార్పొరేట్లకు ,ఫ్యాక్టరీల యజమానులకు మేలు చేకూర్చి కార్మికులను బానిసలుగా ఈ కోడ్స్ మారుస్తున్నాయని పేర్కొన్నారు.
ఒక ప్రక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రైవేటు పరం చేస్తూ మరోపక్క కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ యొక్క లేబర్ కోడ్స్ ను ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధమైనదని తక్షణం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆజాదిక అమృత్ పేరుతో 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర వేడుకలు చేయాలని ఘనంగా నిర్వహించాలని ప్రధాని పిలుపునిచ్చారని నేటికీ ఆకలి చావులు, మత ఘర్షణలు, ఆర్థిక అసమానతలు తో భారతదేశం ఉన్నదని పేర్కొన్నారు.
అనంతరం సిఐటియు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు జన జాగరణ కార్యక్రమం సిఐటియు నిర్వహిస్తున్నదని ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలని పిలుపునిచ్చారు.
జెన్కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత రెండు వందల రోజుల నుండి కార్మికుల పోరాడుతున్నారని ఈ సందర్భంగా జెన్కో వద్ద జరిగే బహిరంగ సభలో కార్మికుల పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం మోహన్ రావు, జి శ్రీనివాసులు, కే పెంచల నరసయ్య, డి అన్నపూర్ణమ్మ, కట్టా సుబ్రహ్మణ్యం ,గడ్డం అంకయ్య తదితరులు పాల్గొన్నారు.