వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం : కాకాణి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం : కాకాణి
నెల్లూరు ప్రతినిధి, ఏప్రిల్ 10 (సదా మీకోసం) :
నెల్లూరు జిల్లా తో పాటు తిరుపతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడిని సమన్వయం చేసుకుంటానని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
నెల్లూరు పొదలకూరు రోడ్డు లోని కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరం కలిసే నడుస్తామని… 2024 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు లోని ఎనిమిది నియోజకవర్గాలు తిరుపతి నియోజకవర్గంలోని మూడు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తామన్నారు ఆయన పేర్కొన్నారు.
మంత్రి పదవి తనకు హోదా కాదని ప్రజలకు సేవ చేసేందుకు బాధ్యత అన్నారు.
తనపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర మంత్రివర్గంలో తనకు చోటు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.
మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలకు పెద్ద పీట వేసరని ప్రశంసించారు.
ఆ అంశాలే కాకాణికి కలిసొచ్చాయి
ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో దిట్ట, తనదైన వాగ్దాటితో ఎదుటి వారిని ఆకట్టుకునే శైలి, ఏ విషయంపైన అయినా అవగాహన, సమకాలీన అంశాలపై సమర్థత , నిత్యం ప్రజలతో మమేకమయ్యే లక్షణం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై ప్రత్యేక శ్రద్ద, అందరినీ కలుపుకు పోగలడనే నమ్మకం ఇవి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు వినగానే గుర్తొచ్చే అంశాలు. ఈ అంశాలే నూతన మంత్రి వర్గంలో ఆయన స్థానాన్ని ఖరారు చేశాయి.
ఉన్నత విద్యావంతుడు
విద్యార్హత : బీ.ఈ. (సివిల్ ఇంజనీరింగ్) – మైసూర్ యూనివర్శిటీ
ఎం.బీ.ఏ. (హ్యూమన్ రిసోర్స్) పెరియార్ యూనివర్శిటీ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్)
ఎం.ఏ. (సైకాలజీ) ఉస్మానియా యూనివర్శిటీ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్)
(పీ.హెచ్.డీ) – ఎవల్యూషన్ అండ్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ పంచాయతీ రాజ్ సిస్టమ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్శిటీ.
కుటుంబం : కాకాణి కుటుంబానికి ఘనమైన రాజకీయ నేపథ్యం ఉంది. పొదలకూరు సమితి ప్రెసిడెంట్‌గా 18 సంవత్సరాలు పని చేసిన కాకాణి రమణారెడ్డి, అలాగే పాతికేళ్ల పాటు తోడేరు గ్రామానికి సర్పంచ్‌గా చేసిన కాకాణి లక్ష్మి కాంతమ్మ దంపతులకు 10.11.1964న జన్మించారు గోవర్ధన్‌రెడ్డి. ఆయన భార్య కాకాణి విజిత ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఇద్దరు పిల్లలు కాకాణి పూజిత, కాకాణి సుచిత్ర. ఇద్దరిని ఉన్నత చదువులు చదివించిన గోవర్ధన్ రెడ్డి వారిద్దరికి పెళ్లిళ్లు చేశారు.
రాజకీయ జీవితం : దాదాపు 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి.. 2006లో కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పీ టీసీగా పోటీచేసి గెలిచారు. 2006 నుంచి 2011 వరకు నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేసిన కాకాణి గోవర్ధన్రెడ్డి.. 2014లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో 5,744 ఓట్ల ఆధిక్యంతో కాకాణి గెలుపొందారు. రెండో సారి అదే నియోజకవర్గం 2019లో మరోసారి 13,866 ఓట్ల ఆధిక్యంతో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల్లో వరుసగా అన్ని రౌండ్లలోనూ కాకాణి ఆధిక్యత సాధించారు. అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ ఛైర్మన్గా 2019 నుంచి ఉన్నారు.