జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్ నాయక్
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్ నాయక్
రాపూరు, మార్చి 22 (సదా మీకోసం) :
రాపూరు సివికె ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ (ఎఫ్ఏసీ) గా వెంకట్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ అధ్యాపకులగా పని చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రాపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం కళాశాల అధ్యాపకులు వెంకట్ నాయక్ ను శ్యాలువాతో సత్కరించి బొకే అందజేశారు.కళాశాలలో పని చేసే అధ్యాపకులు అందరం కలిసి కట్టుగా పని చేసి కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువద్దమన్నారు.
అనంతరం కళాశాలలో గతంలో,ఇప్పటి వరకు ప్రిన్సిపల్స్ గా పనిచేసిన కేశవ్ కుమార్,నాహీద్ లు వెంకట నాయక్ ను ప్రత్యక్షంగా అభినందించారు.