వైసిపి రాజకీయ పార్టీనా…..! రాసలీలల పార్టీనా….? : పనబాక భూలక్ష్మి
వైసిపి రాజకీయ పార్టీనా…..! రాసలీలల పార్టీనా….?
నెల్లూరు పార్లమెంట్ టిడిపి మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి
నెల్లూరు, ఆగష్టు 5 (సదా మీకోసం) :
వైసీపీ నాయకుడు, ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్య సమాజం తలదించుకునేలా వీడియోలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని నెల్లూరు పార్లమెంట్ టిడిపి మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి తీవ్రంగా ఖండిచారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభలలో అక్కా చెల్లెమ్మలు, అక్కా చెల్లెమ్మలు అంటూ మాట్లాడడం కాదు, ఆ అక్కాచెల్లెమ్మలపై జరిగే అరాచకాలు పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఆడబిడ్డల పై అత్యాచారాలు, దాడులు జరిగిన వైసీపీ ప్రభుత్వం లో మహిళా నాయకురాలు కు కనిపించవా అని దుయ్యబట్టారు.
మహిళకు ఏ కష్టం వచ్చిన గన్ కన్నా అన్న ముందు వస్తాడు అని చెప్పిన రోజా ఎక్కడ అని, ఆడబిడ్డలు అత్యాచారాలకు బలి అయితే తల్లి యొక్క పెంపకాన్ని తప్పుబట్టిన హోమ్ మినిస్టర్ వనిత ఎక్కడ అని, మరి మీ వైసీపీ ఎంపీ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు తప్పు ఎవరిది మీ ముఖ్యమంత్రిదా? హోం మినిస్టర్ దా అని ప్రశ్నించారు.
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులకు అత్యంత కీలక పదవులు ఇవ్వడమే నా మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా, అబంటి రాంబాబు, అవంతి శ్రీనివాసులు గంట, అరగంట అంటూ మహిళలను సామాజిక మాధ్యమాల్లో వేధించి నప్పుడు వైసీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ వైసిపి నాయకుడు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి ఉంటాడా అని ప్రశ్నించారు.
కానీ వైసీపీ ప్రభుత్వంలో గంట చాలు అని మహిళ తో అసభ్యకరంగా మాట్లాడిన అంబటి రాంబాబుకి కీలకమైన జలవనరుల శాఖ మంత్రి పదవితో సత్కరించారు. స్వయానా మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ అంబటి రాంబాబుది ఎటువంటి తప్పులేదు అని సర్టిఫికేట్ ఇస్తారా అని ప్రశ్నించారు.
దీంతో వైసీపీ నాయకులు అక్రమాలు, దాడులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మన ముఖ్యమంత్రి కీలక పదవులు ఇస్తారు అని ఇంత నీచంగా వ్యవహరిస్తున్నారన్నారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాలు ఎక్కడ? వైసీపీ నాయకులకు వర్తించవా అని ప్రశ్నించారు.
నాయకులు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, కానీ వైసీపీ నేతలు రేపిస్టులకు మహిళలను వేధించే ఆకతాయిలకు ఆదర్శంగా మారారన్నారు.
మహిళల్ని లైంగికంగా వేధించిన గోరంట్ల మాధవ్ అలాంటి క్రిమినల్స్ కి పార్లమెంట్ లో ఉండే అర్హత లేదని, వెంటనే లోక్ సభ స్పీకర్ గోరంట్ల మాధవ్ ని బర్తరఫ్ చేయాలని తెలుగు మహిళా సంఘం తరపున డిమాండ్ చేశారు.