రత్నంలో ఘనంగా ” సైన్స్ ఎపిటోమ్”
రత్నంలో ఘనంగా ” సైన్స్ ఎపిటోమ్”
నెల్లూరు విద్య, మార్చి 11 (సదా మీకోసం) :
నగరంలోని డైకస్ రోడ్ లోని డా. కిషోర్స్ రత్నం మోడల్ స్కూల్ లో శుక్రవారం ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ” సైన్స్ ఎపిటోమ్” అనే సైన్స్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా డా. కిషోర్స్ రత్నం స్కూల్స్ జనరల్ మేనేజర్ రామూర్తి నాయుడు పాల్గొని పిల్లలు చేసిన సైన్స్ మోడల్స్ ను ప్రాజెక్టులను, ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను చక్కగా వివరించిన విద్యార్థులను అభినందించారు.
అందరు విధిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని విధ్యర్డులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థిని విద్యార్థిలకు ఉపాద్యాయులు కు అభినందనలు ను తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనిన పిల్లలను డైరెక్టర్లు డా. కృష్ణా కిషోర్, వాసంతి కిషోర్, పాఠశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, సీఓ సుగుణ, మేనేజర్ విజయచంద్ర, ఉపాద్యాయులు అభినందించారు