ఆదర్శనీయులు బాబు జగ్జీవన్ రామ్
ఆదర్శనీయులు బాబు జగ్జీవన్ రామ్
మేయర్ స్రవంతి జయవర్ధన్
-: నెల్లూరు కార్పొరేషన్, మార్చి 5 (సదా మీకోసంం) :-
స్వాతంత్య్ర పోరాట యోధునిగా, దళిత జనోద్ధరణ నాయకునిగా బాబు జగ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయులని నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ కీర్తించారు.
జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి స్థానిక వేదాయపాలెం కూడలిలోని ఆయన విగ్రహానికి మేయర్ మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అంటరానితనం అమానుషం అని చాటి, అస్పృశ్యత నివారణకు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు.
దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం కల్పించాలని, మంచినీటి బావులను ఉపయోగించుకునేందుకు దళితులకు అవకాశం ఇవ్వాలని హిందూ మహాసభ సమావేశాల్లో తీర్మానం ప్రవేశ పెట్టిన ఘనత జగ్జీవన్ రామ్ కే దక్కుతుందని మేయర్ పేర్కొన్నారు.
సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు 1940లో రెండుసార్లు ఆయన జైలు పాలయ్యారని, వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని మేయర్ వెల్లడించారు.