19న ఆల్ ఇండియా కళారంగం నూతన కార్యవర్గ ఎన్నిక
19న ఆల్ ఇండియా కళారంగం నూతన కార్యవర్గ ఎన్నిక
నెల్లూరు సాంస్కృతికం, మార్చి 16 (సదా మీకోసం) :
నెల్లూరు నగరంలోని రేబాల లక్ష్మీ నరసారెడ్డి పురమందిరంలో మార్చి 19వ తేది సకల వృత్తి కళారంగం (ఆల్ ఇండియా కళారంగం) నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ ఆర్. హరిత, డైరెక్టర్లు మంజుల, షేక్ సమీన, కె.శేఖర్ రెడ్డి, ప్రముఖ సీనియర్ రంగస్థల నటులు ఎమ్ ఆర్ విజయ కుమార్, వల్లకవి వెంకట సుబ్బారావు, షేక్ షరీఫ్, రేబాల శ్రీలక్ష్మి, ఎమ్.పుల్లయ్య ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆల్ ఇండియా కళారంగం వ్యవస్థాపక అధ్యక్షులు, మాడుగుల సుధీర్, ఆల్ ఇండియా కళారంగం అనంతపురం జిల్లా అధ్యక్షులు ఎస్.వి రమణ, కడపజిల్లా అధ్యక్షుడు బద్వేలు రవితేజ, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గంగారపు వెంకట రమణ, విజయనగరం జిల్లా అధ్యక్షులు బోను సింహాచలం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ని కళాకారులు,నెల్లూరు జిల్లాలోని కళాకారులు పాల్గొన్న నున్నారు.
ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రద చేయవలసిందిగా ఆల్ ఇండియా కళారంగం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ బి.వై.కె యాదవ్ కోరారు.