వేమిరెడ్డిని అభినందించిన కాకాణి
వేమిరెడ్డిని అభినందించిన కాకాణి
సుమారు 20 నిమిషాలు సేపు పలు అంశాలపై చర్చలు
కోవూరు, ఏప్రిల్ 20 (సదా మీకోసం) :
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్ సిపి నూతన జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం కోవూరు నియోజకవర్గ లేగుంటపాడులోని వి.పి. ఆర్. ఫామ్ హౌస్ కు వెళ్లి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.
పూల బొకే ను అందచేసి అభినందనలు తెలియ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సుమారు 20 నిమిషాలు పలు అంశాలపై చర్చించారు.