జిల్లా పోలీసు కార్యాలయములో ఘనంగా విజయదశమి వేడుకలు

0
Spread the love

జిల్లా పోలీసు కార్యాలయములో ఘనంగా విజయదశమి వేడుకలు

  • జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధపూజ నిర్వహించిన….. జిల్లా యస్.పి. విజయ రావు
  • జిల్లా ప్రజలందరికీ, పోలీసు అధికారులు, సిబ్బందికి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన యస్.పి.
  • DPO లో ఏర్పాటు చేసిన 26 ఫిక్సుడు CC TV కెమెరాలు ప్రారంభించిన యస్.పి.
  • తదుపరి పోలీసు సంక్షేమంలో భాగంగా పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు గల రెనోవేషన్ చేసిన షటిల్ కోర్టును ప్రారంభించారు.
  • ప్రతి ఒక్కరూ వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలి
  • ప్రజలందరూ పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలి
  • దేవాలయాల దర్శనం నిమిత్తం వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ తప్పకుండా కోవిడ్ నియమాలు పాటించాలి
  • దేవాలయాల వద్ద దసరా వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు

-: నెల్లూరు క్రైం , అక్టోబ‌ర్ 15 (స‌దా మీకోసం) :-

దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా యస్.పి. విజయ రావు, మొదట క్యాంప్ ఆఫీస్ నందు, జిల్లా AR హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో, తదుపరి DPO నందు, అనంతరం మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లలో పోలీసు ఆయుధాలకు మరియు పోలీసు వాహనాలకు ఘనంగా పూజలు నిర్వహించారు. అంతేకాకుండా యస్.పి. గారు భద్రతలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన CCTV కెమెరాల ప్రారంభం, పోలీసు సంక్షేమంలో భాగంగా పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు గల రెనోవేషన్ చేసిన షటిల్ కోర్టు ప్రారంభం చేసారు.

అనంతరం జిల్లా యస్.పి. మాట్లాడుతూ ఆయుధ పూజ పురాతన కాలము నుండి అనాదిగా ఆచరిస్తున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, అది చెడుపై విజయానికి నాందిగా విజయదశమి నిర్వహించుకుంటామని, కుల మతాలకు అతీతంగా అందరూ పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయుధ పూజలు నిర్వహిస్తూ ఉంటారని తెలియజేసినారు.

అనంతరం సాయుధ పోలీస్ కార్యాలయంలో ఘనముగా పూజలను నిర్వహించి, పోలీసు అధికారులందరికీ తీర్ద ప్రసాదాలు అందించి, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం MT ఆఫీసులో పూజా కార్యక్రమంలో పాల్గొని, సుందరంగా అలంకరించారని అభినందించారు.

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది అని అపోహ పడకండని, నవరాత్రి ఉత్సవాలు జరిగే దేవాలయాల దర్శనం నిమిత్తం వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ తప్పకుండా కోవిడ్ నియమాలు పాటించాలి.

దేవాలయాలలో మాస్కు ధరిస్తు, భౌతిక దూరం పాటిస్తూ క్యూ లైన్ పద్ధతిలో దర్శనం నకు వెళ్లాలని సూచించారు.

దసరా ఉత్సవాలు జరిగే దేవాలయాలు, నవరాత్రి ఉత్సవాలు జరిగే అమ్మవారి ఆలయాలు, ప్రదేశాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేస్తు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బందోబస్తుతో పాటు ఆయా పరిసరాలలో దొంగతనాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.

కార్యక్రమంలో యస్.పి. తో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) వెంకటరత్నం, యస్.బి. డి.యస్.పి. కోటారెడ్డి, టౌన్ డి.యస్.పి. జె.శ్రీనివాసులు రెడ్డి, డి.యస్.పి.(ఏ.అర్.) GM గాంధీ, యస్.బి. CI-1 అక్కేశ్వరరావు, CI-2 రామకృష్ణ, వెల్ఫేర్ ఆర్.ఐ. శ్రీనివాసులురెడ్డి, ఆర్.ఐ. అడ్మిన్ రామణారెడ్డి, MTO పౌల్ రాజ్ గార్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!