విద్యుత్ స్థంభం ఏర్పాటును అడ్డుకున్న స్థానికులు
విద్యుత్ స్థంభం ఏర్పాటును అడ్డుకున్న స్థానికులు
నెల్లూరు రూరల్, సదా మీకోసం :
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్ నేతాజీ నగర్ లో నడిరోడ్డులో విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు.
స్థానికులు, అధికారులతో 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల, కరణం హజరత్ నాయుడు మాట్లాడారు.
సాధారణంగానే ఇది చిన్న రహదారి. నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి.
హైటెన్షన్ వైర్లతో కూడిన విద్యుత్ స్తంభాన్ని రోడ్డుకు దగ్గరగా ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక కార్పొరేటర్ కరణం మంజుల, హజరత్ నాయుడు దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. దీంతో హజరత్ నాయుడు అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు.
కాగా రెండు, మూడు రోజుల్లో స్థంభం మారుస్తామని ఏఈ చెప్పారని తెలిపారు. స్థంభం తొలగించకుంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మేయర్ స్రవంతిల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హజరత్ నాయుడు అన్నారు.
స్థంభం తొలగించాలని, ఇప్పటికే ఇక్కడ ఆక్రమణలు ఎక్కువయ్యాయనీ స్థానికులు ఆరోపిస్తున్నారు.
కార్యక్రమంలో 33 వ డివిజన్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు