కార‌కుల‌ను వ‌దిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు

0
Spread the love

కార‌కుల‌ను వ‌దిలి కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు : మాదాల వెంకటేశ్వర్లు

-: నెల్లూరు, జూన్ 25 (స‌దా మీకోసం) :-

37 వ డివిజన్ మాస్టర్ కేంద్రం నుండి నలుగురు కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మాస్టర్ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం కార్మికులు నిర్వ‌హించారు.

కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాదాల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ…. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య పనులు నిర్వహించే వారంతా నిరుపేద దళితులు గిరిజనులు, వీరి చేత మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య పనులు నిర్వహించడమే కాకుండా! వీరిని అనేక ప్రాంతాల్లోకి పనులకు పంపించడం జరుగుతుందన్నారు.

అందులో భాగంగానే డిఆర్వో బంగ్లాలో ఇతర చోట్ల పని చేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి, మున్సిపల్ కమిషనర్ మూడవ తేదీన 37 వ డివిజన్ మాస్టర్ కేంద్రం వద్దకు వచ్చి నలుగురు కార్మికులను తొలగించారని తెలిపారు.

తొలగించిన నలుగురు కార్మికులు ఏ ఏ ప్రాంతాల్లో పనిచేస్తుంది. ఎవరు చెప్తే పనిచేస్తుంది. వివరణ ఇచ్చినా కానీ, వారిని ఇంతవరకు పనిలో పెట్టుకోకుండా, వారిని ఇబ్బంది పాలు చేస్తున్నారని విమ‌ర్శించారు.

ఈ విషయంపై కమిషనర్ ని అడిగితే, మాకు సంబంధం లేకుండా ఆ విధంగా పోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారని తెలిపారు.

ఈ పరిస్థితికి కారకులెవరో వారిపై చర్యలు తీసుకోవాల‌ని సిఐటియు డిమాండ్ చేస్తుంద‌న్నారు.

కార్మికుల పై చర్యలు తీసుకోవడం సబబు కాదు అని తెలిపారు.

అధికారులుగా కార్మికులను మీరే పంపించి. కార్మికుల కడుపు కొట్టే చర్యలు కరెక్ట్ కాద‌ని ఇప్పటికైనా ఆ మాస్టర్ లో ఆ కార్మికులకు విధులు ఏర్పాటు చేయండని డిమాండ్ చేశారు.

వారు పని చేయకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం కొండాయపాలెం గేట్ సెంటర్ వద్ద బీసీ కార్పొరేషన్ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన నీటిపారుదల శాఖ మాత్యులు అనిల్ కుమార్ యాదవ్ కి, ఐ టి ఐ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.

కార్యక్రమంలో లో సి ఐ టి యు రూరల్ కమిటీ అధ్యక్షులు కొండా ప్రసాద్, కార్యదర్శి అల్లాడి గోపాల్, సీఐటీయూ రూరల్ కమిటీ సెక్రటేరియట్, బత్తల కిష్టయ్య, కిన్నెర కుమార్, కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!