మండలం లో పర్యటించిన మందల వెంకట శేషయ్య

మండలం లో పర్యటించిన మందల వెంకట శేషయ్య
వెంకటాచలం, ఏప్రిల్ 03 (సదా మీ కోసం) :
వెంకటాచలం మండలం లోని పలు గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మం దల వెంకట శేషయ్య పర్యటించారు.
రైతులతో మాట్లాడి. ధాన్యం అమ్మకాలను సమీక్షించిన అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు.. ఏరోజైనా రైతులు దాన్యం రాశుల దగ్గరికి వచ్చావా అని ప్రశ్నించారు.
అధికారం ఉన్నప్పుడు మిల్లర్లుదగ్గర ముడుపులు తీసుకొని, రైతాంగాన్ని నిట్టనిలువునా
దోచుకోవడం రైతులు ఇప్పటికీ మరువలేదని, రైతుల ఉసురు తగిలి నాలుగుసార్లు ఓడిపోయావని విమర్శించారు.
నీరు-చెట్టు పథకం పేరిట రైతులను అడ్డు పెట్టుకొని, పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేసిన ఘనుడు అని రైతులు ఇప్పటికీ మరువలేదన్నారు.
సరే పల్లి నియోజకవర్గం లో రైతులు నాలుగుసార్లు తరిమికొట్టినా రైతు డ్రామా ఆడుతున్నావన్నారు.
సరే పల్లి నియోజకవర్గం లో రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవడానికి తమ ధాన్యాన్ని తరలిస్తే. కొనుగోలు చేయడానికి ప్రభుత్వం యంత్రాంగం సిద్ధంగా ఉంది అన్నారు.
సోమిరెడ్డి తన తెలుగుదేశం నాయకులు, సానుభూతిపరుల చెందిన ధాన్యం రాశుల దగ్గరికి వెళ్లి ప్రభుత్వం కొన లేదంటూ హేళన చేయడం సరికాదన్నారు.
ధాన్యానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా, మా దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.