రాష్ట్రంలో అర్హులందరికీ అక్రిడిటేషన్లు అందిస్తాం : మంత్రి పేర్ని నాని
రాష్ట్రంలో అర్హులందరికీ అక్రిడిటేషన్లు అందిస్తాం : మంత్రి పేర్ని నాని
- రాష్ట్రంలో అర్హులందరికీ అక్రిడిటేషన్లు అందిస్తాం
- అర్హులైన పాత్రికేయులు ఈ నెల 28 నుండి ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు
- రాష్ట్రంలో ఇప్పటికే 40,442 మంది ఆన్ లైన్ లో అక్రిడిటేషన్ కార్డులు కొరకు ధరఖాస్తు చేసుకున్నారు
- ఆరోపణలకు తావులేకుండా పారదర్శకతతో అక్రిడిటేషన్లు మంజూరు
- రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
-: విజయవాడ, జూన్ 25 (సదా మీకోసం) :-
అర్హతగల ప్రతీ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఇందుకు సంబంధించి ఈ నెల 28వ తేదీ నుండి ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చునని రాష్ట్ర రవాణా పౌర సంబంధాల శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.
విజయవాడ ఆర్ టి సి కాంప్లెక్స్ లోని రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ కమిషనరు టి.విజయకుమార్ రెడ్డి తో కలిసి మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ అక్రిడిటేషన్ కార్డులు జారీకి ప్రభుత్వం తీసుకువచ్చిన 142 జిఓను సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక వ్యక్తి వేసిన పిటీషన్ కారణంగా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అక్రిడిటేషన్ కార్డుల జారీలో తీవ్ర జాప్యం జరిగిందని మంత్రి అన్నారు.
సదరు వ్యక్తి వేసిన పిటీషన్ ను హైకోర్టు డిస్ మిస్ చేసి జిఓ నెంబరు 142 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయమని ప్రభుత్వానికి సూచిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి పేర్ని నాని అన్నారు.
ఈఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో అర్హతగల ప్రతీ జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఈ నెల 28 నుండి ప్రారంభిస్తామని మంత్రి అన్నారు.
ఆరోపణలకు తావీయకూడదనే ఉద్దేశ్యంతో అక్రిడిటేషన్ల జారీలో మరింత పారదర్శకతకోసమే వివిధ ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర, జిల్లాస్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేశామని ఈకమిటీలు వివక్షతకు తావులేకుండా స్వతంత్యంగా వ్యవహరిస్తాయని మంత్రి అన్నారు.
రాష్ట్ర స్థాయి మీడియా అక్రిడిటేషన్ కమిటీకి ఐఅండ్ పిఆర్ కమిషనరు అధ్యక్షులుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సభ్యులుగా ఐఅండ్ పిఆర్ శాఖ అడిషినల్ డైరెక్టరు కన్వీనరుగా వ్యవహరిస్తారని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టరు అధ్యక్షతన గల జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీలో వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని, జిల్లా స్థాయి సమాచార శాఖ అధికారి కన్వీనరుగా వ్యవహరిస్తారని మంత్రి అన్నారు.
ఈకమిటీల ద్వారా రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో మంజూరు చేసిన అక్రిడిటేషన్ల కాలవ్యవధి రెండు సంవత్సరాలు ఉంటుందని మంత్రి అన్నారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వచ్చే సమయానికి రాష్ట్రంలో 40 వేల 442 మందికి ఆన్ లైన్ లో అక్రిడిటేషన్ కార్డులు కోసం తమ పేర్లు రిజిష్టరు చేసుకున్నారని వీరిలో 32 వేల 314 మంది వారి వద్ద ఉన్న ధృవపత్రాలతో రిజిష్టరు చేసుకున్నారని వీరిలో 17 వేల 139 ధరఖాస్తులను అధికారులు పరిశీ లించారని మంత్రి అన్నారు.
వీరిలో 874 మంది ధరస్తులను మాత్రమే అన్ని ధృవపత్రాలతో రిజిష్టరు చేసుకున్నారని వారికి అక్రిడిటేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించామన్నారు.
వీటిలో కోర్టు ఉత్తర్వులు వచ్చే నాటికి 464 మందికి కార్డులు మంజూరు చేశామని మిగిలిన 410 మందికి సోమవారం నుండి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.
ఆన్ లైన్ ద్వారా సరి అయిన ధృవపత్రాలు చూపని 6492 మంది నుండి తిరిగి సరి అయిన ధృవపత్రాలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలని కోరామని వీరిలో 90 ధరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని మంత్రి తెలిపారు.
ఇప్పటికే జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టరు అధ్యక్షతన ప్రలిమినరీ మీటింగ్ లు జరిగాయని మంత్రి అన్నారు.
అక్రిడిటేషన్ కొరకు ఆన్ లైన్ లో ప్రభుత్వం సూచించిన విధంగా యాజమాన్యం వారి ఆర్.ఎన్.ఐ, సర్క్యులేషన్ ఫ్రూఫ్ కొరకు ఏబిసి, సిఏ సర్టిఫికెట్, జియస్టి ధృవీకరణ, శాటి లైట్ ఛానల్ అయితే ఐఅండ్ బి పర్మిషన్, కేబుల్ అయితే పోస్టల్, లేబర్ లైసెన్స్, స్టూడియో సెటప్ వివరాలను అప్లోడ్ చేయవలసి ఉందని మంత్రి అన్నారు.
పత్రిక రెగ్యులారిటీ మరియు ఛానల్ టెలికాస్ట్ వివరాలను బట్టి అక్రిడిటేషన్ మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు.
ప్రస్తుతం పనిచేస్తున్న పాత్రికేయులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకున్న తర్వాత వేరే యాజమాన్యానికి మారితే ఆన్ లైన్ లో పరిశీలించి అర్హతమేరకు అక్రిడిటేషన్ మంజూరు చేస్తామని మంత్రి అన్నారు.
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడిటేషన్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు.
కరోనా సమయంలో ప్రభుత్వానికి సహకారం అందించిన పాత్రికేయులందరినీ మంత్రి అభినందిస్తూ, కరోనాకారణంగా మరణించిన పాత్రికేయులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రభుత్వ సహాయం అందించాలని ఇప్పటికే ఆదేశించారని ఈదిశగా అన్ని జిల్లాల్లోనూ కరోనా కారణంగా మరణించిన పాత్రికేయులకు త్వరలో ప్రభుత్వ సహాయాన్ని అందిస్తామని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.
ఈసమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ కమిషనరు టి.విజయకుమార్ రెడ్డి, అడిషినల్ డైరెక్టరు యల్. స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు కిరణ్ కుమార్, టి.కస్తూరి, తదితరులు పాల్గొన్నారు.