మత్స్యకారుల జీవితాలను ధ్వంసం చేసే 217 జీవోను రద్దు చేయాలి

మత్స్యకారుల జీవితాలను ధ్వంసం చేసే 217 జీవోను రద్దు చేయాలి..
మత్స్యకార హోరులో ప్రధాన డిమాండ్…
మత్స్యకారుల జీవనోపాధిని ధ్వంసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 217రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లో మత్స్యకార హోరు కార్యక్రమం ప్రారంభమైంది..
ఈ దీక్ష కార్యక్రమానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత కొల్లు రవీంద్ర హాజరయ్యారు….
ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ…
మత్స్య సంపదకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఉందనీ, మత్స్యకార వృత్తిపై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారన్నారు…
మత్స్య సంపద వల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా అత్యధికంగా వస్తుందన్నారు…
మత్స్యకారుల జీవనాన్ని దెబ్బ కొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 217 ను విడుదల చేయటం సిగ్గుచేటన్నారు….
వెంటనే దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు, వెనక్కి తీసుకుకొక పోతే ఉద్యమం తీవ్ర తరం చేస్తామని అన్నారు..