రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామినాథన్ కు ఘన నివాళులు
రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామినాథన్ కు ఘన నివాళులు
-: కోట, ఆగస్టు 7 (సదా మీకోసం) :-
కోట మండలం చెన్నూరు గ్రామం లోని విద్యా ప్రదాత శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ మాజీ కార్యవర్గ సభ్యులు స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటైన ఎం.వి.రావ్ ఫౌండేషన్ కార్యాలయంలో శుక్రవారం లో జాతీయ చేనేత దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.
శుక్రవారం ఎం.వి.రావు.ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం, భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన మహాకవి స్వర్గీయ రవీంద్ర నాథ్ ఠాగూర్ వర్ధంతి భారత వ్యవసాయ శాస్త్రవేత్త హరిత విప్లవ పితామహుడు పద్మ విభూషణ్ ఎం.ఎస్.స్వామినాథన్ జయంతి వేడుకలను ఎం వి రావ్ పౌండేషన్ కార్యాలయంలో నిర్వాహకులు నిర్వహించారు.
ముందుగా స్వర్గీయ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంఎస్ స్వామినాథన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి వారికి ఘన నివాళులు అర్పించారు.
భారతదేశం తెరపడే కవి పితామహుడు భారతదేశ జాతీయ గీతం రూపకర్త రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ మహాకవి సేవలు మరుపు రాణి వని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు.
భారత వ్యవసాయ రంగంలో నూతన వరి వంగడాలను సృష్టించి హరిత విప్లవానికి పితామహునిగా భారతదేశం గర్వించదగ్గ వరి వంగడాలు సృష్టికర్త ఎంఎస్ స్వామినాథన్ అపూర్వ మేధావిగా ఆయన అన్నారు.
అదే విధంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు అభినందనలు తెలియజేస్తూ చేనేత రంగంలో వివిధ కళాత్మకమైన సృజనాత్మకమైన చేనేత దుస్తులు తయారు చేసే వారికి కార్మికులకు చైర్మన్ అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికుల కు సన్మానం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఎం.వి.రావు.ఫౌండేషన్ ఛైర్మెన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, ఎం.ఆదిలక్ష్మి, ఎం.విజయలక్ష్మి నిర్వాహకులు పాల్గొన్నారు.