లో వోల్టేజి సమస్యని పరిష్కరించండి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి
లో వోల్టేజి సమస్యని పరిష్కరించండి
పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డిని కోరిన ప్రజలు
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గత 17 రోజులుగా జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నేడు మైపాడు రోడ్డు జాఫర్ సాహెబ్ కాలువ కట్ట ప్రాంతంలో జరిగింది.
ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్క కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి వారి సమస్యల అధ్యయనం చేసారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద పలువురు ప్రజలు తమ ప్రాంతంలో రోడ్లన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయని వాపోయారు.
ఈ ప్రాంతంలోనే కాదని, నెల్లూరు సిటీ మొత్తం రోడ్ల పరిస్థితి ఇలానే ఉందని, వైసీపీ ప్రభుత్వం నెల్లూరు సిటీని పూర్తిగా గాలికి వదిలేసి దుర్భరంగా మార్చేసిందని కేతంరెడ్డి వారితో తెలిపారు.
దోమల సమస్య అధికంగా ఉందని, నివారణ చర్యలకు ప్రభుత్వం పూనుకోవట్లేదని పలువురు ప్రజలు తెలిపారు. దోమల బెడద నుండి, ఉక్కపోత నుండి బయటపడేందుకు ఫ్యాన్లు వేసుకుని నిద్ర పోదామంటే, ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరగట్లేదని, తమ ప్రాంతంలో లో వోల్టేజి సమస్య ఉందని పలువురు కేతంరెడ్డికి తెలిపారు.
విద్యుత్ అధికారుల వద్ద ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా తమ సమస్య తీరట్లేదని, వోల్టేజికి తగ్గట్లు ట్రాన్స్ ఫారంలు ఇక్కడ ఏర్పాటు చేయట్లేదని వారు ఆవేదనా వ్యక్తం చేశారు.
వారి సమస్యలను క్షుణ్ణంగా విన్న కేతంరెడ్డి ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని ప్రజలకు భరోసా కలిపించారు.
సంబంధిత విద్యుత్ శాఖాధికారులను కలిసి ఈ సమస్యను విన్నవిస్తామని, అప్పటికి కూడా వారు పరిష్కారానికి పూనుకోకుంటే పోరాడతామని తెలిపారు.
ఒక్క అవకాశం అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ఇస్తే రాష్ట్రం అంధకారంగా మారిందని దుయ్యబట్టారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.