నెల్లూరు జిల్లాకు మొదటి విడతలో 53,953 ఇళ్లు కేటాయించాం

0
Spread the love

నెల్లూరు జిల్లాకు మొదటి విడతలో 53,953 ఇళ్లు కేటాయించాం

-: నెల్లూరు, జూన్ 26 (స‌దా మీకోసం) :-

నవ రత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలను నిర్మిస్తున్నారని హౌసింగ్ శాఖామంత్రి సిహెచ్.రంగనాథ రాజు తెలిపారు.

నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో శనివారం.., జిల్లా ఇంఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతంరెడ్డి, జలవనరుల శాఖామంత్రి పి.అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబుతో కలిసి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు- వైఎస్ఆర్ జగనన్న కాలనీలపై ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో సమీక్షా నిర్వహించిన హౌసింగ్ శాఖామంత్రి.., నెల్లూరు జిల్లాకు మొదటి విడతలో 53,953 ఇళ్లు కేటాయించామన్నారు.

గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను కూడా జగనన్న కాలనీల్లోని నిర్మాణ విధుల్లో వినియోగించడానికి ఇప్పటికే అనుమతులు మంజూరు చేశామన్న మంత్రి.., సిబ్బంది కొరత ఉన్నచోట వారిని వినియోగించుకోవాలన్నారు.

జగనన్న కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామని, విద్యుత్, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి సిస్టంతో పాటు.., అన్ని మౌలిక సదుపాయలను కల్పిస్తామన్నారు.

ప్రతి నియోజకవర్గానికీ, మండలానికీ, పంచాయతీకీ ఓ అధికారిని ప్రత్యేకంగా నియమించి.., లే అవుట్స్ లోని ప్రతి 20 ఇళ్లకు ఓ కమిటీని ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి లక్షా 80 వేలు అందిస్తున్నామని.., ఎస్టీ, ఎస్సీలతో పాటు.., ఇంటి నిర్మాణం చేసుకోలేని కుటుంబాలకు కూడా ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇస్తుందన్నారు.

కరోనా సమయంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల ద్వారా ఉపాధిని కూడా కల్పిస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జి మంతి బాలినేని శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.., సీఎం జగన్మోహన్ రెడ్డిది రైతు ప్రభుత్వమని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసి.., పొగాకు రైతులను ఆదుకున్నారన్నారు. దీంతోపాటు.. జిల్లాలో మొదటి దశలో దాదాపు 50 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేశామన్నారు. అగ్రికల్చరీ అడ్వైజరీ బోర్డు సమావేశంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, రైతుల వద్ద నుంచి సలహాలు స్వీకరించామని.., వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఆర్.బి.కె లను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

ఈ సమావేశంలో పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ.., జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం సిమెంట్, ఇనుము, ఇసుకను అందిస్తోంది అని.., లబ్ధిదారులను కూడా ఇళ్ల నిర్మాణంలో భాగస్వామ్యులను చేస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో జలవనరుల శాఖామంత్రి పి.అనిల్ కుమార్ మాట్లాడుతూ.., జగనన్న కాలనీల నిర్మాణాలను పనులకు సిబ్బంది కొరత ఉందని.., 500 సివిల్ ఇంజనీర్లను తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించుకుని, పనులు వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని హౌసింగ్ శాఖామంత్రి సిహెచ్.రంగనాథరాజును కోరారు.

ఇంటి నిర్మాణానికి ఇబ్బందులు పడుతున్న లబ్ది దారులకు బ్యాంకుల నుంచి లోన్ సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ.., రాష్ట్రంలోనే జగనన్న కలనీలకోసం అతి తక్కువ ఖర్చుతో భూ సేకరణ చేసిన జిల్లా నెల్లూరు జిల్లా అని తెలిపారు. జగనన్న కాలనీల్లో లక్షా 73 వేల పైగా ప్లాట్లను సిద్ధం చేశామని, లక్షా 24 వేల మందికి డిసెంబర్ 25 నుంచి పట్టాలు అందించే కార్యక్రమం ప్రారంభించామన్నారు. జిల్లాలో 39,518 మందికి టిడ్కో హౌసింగ్ పట్టాలు అందించామన్నారు. మొదటి విడతలో కేటాయించిన 53,953 ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎన్.ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.., భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా ఇళ్ల నిర్మాణాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టారన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే సాయం లక్షా 80 వేలు సరిపోవడం లేదని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని.., ఆ సహాయాన్ని 2 లక్షల 50 వేలకు పెంచాలని కోరారు. లే అవుట్స్ లలో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులను అందిస్తే.., జగనన్న కాలనీల్లో పనులు మరింత వేగవంతమవుతాయన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే కె.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.., నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇళ్ల లే అవుట్స్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో ఐటీ పార్క్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.., వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, ఉదయగిరిలో పరిశ్రమల ఏర్పాటుచేసి, స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఎమ్మెల్యే కె.సంజీవయ్య, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ ) విదేహే ఖరే, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ) హరేంధిర ప్రసాద్, మున్సిపల్ కమీషనర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) టి.బాపిరెడ్డి, జెడ్పి సి.ఈ.ఓ పి.సుశీల, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!