ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పరామర్శించిన మాజీ మంత్రి సోమిరెడ్డి
ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పరామర్శించిన మాజీ మంత్రి సోమిరెడ్డి
నెల్లూరు నగరం, ఏప్రిల్ 7 (సదా మీకోసం) :
ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ కార్పరేటర్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు.
బాలాజీ నగర్ లోని ఉచ్చి నివాసం లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తో కలసి పరామర్శించారు.
ఉచ్చి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. విద్యావంతుడు, రాజకీయాలలో చురుకుగా పాల్గొనే నాయకుడు భువనేశ్వర్ ప్రసాద్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవ చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో వేనాటి సతీష్ రెడ్డి, మురళీ కృష్ణా రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బాలాజీ, ఆకుల హనుమంతరావు, పసుపులేటి మల్లికార్జున, సుభాన్ భాష, తానే మస్తాన్, తిరుపతి, భార్గవ్ రామ్ , పావురాల రమేష్, శశి, శేషయ్య నాయుడు, మరియు విశ్రాంత ఉద్యోగులు ఆర్ విశ్వనాధం, కె లోక్ సాయినాధ్, కె చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.