నగర పాలక సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తా : నూతన కమిషనర్ హరిత

0
Spread the love

నగర పాలక సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తా

నూతన కమిషనర్ హరిత

నెల్లూరు కార్పొరేషన్, ఆగ‌ష్టు 4 (స‌దా మీకోసం) :

జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సారధ్యంలో నెల్లూరు నగర పాలక సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తానని కార్పొరేషన్ నూతన కమిషనర్ డి.హరిత పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ గా గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారంతో నగర వ్యాప్తంగా ఉత్తమమైన అభివృద్ధిని సాధిస్తామని ఆకాంక్షించారు.

నగర పాలక సంస్థ అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహించి నగరాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తామని కమిషనర్ తెలిపారు.

వేగవంతమైన పాలన అందించేందుకు, త్వరితగతిన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు గతంలో నెల్లూరులో పనిచేసిన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు.

అనంతరం కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతిని మేయర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకుని వివిధ అంశాలపై చర్చించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ ను నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కలుసుకుని పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

నెల్లూరు నగర మునిసిపల్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసిన మునిసిపల్ కమీషనర్ డి. హరిత.
నెల్లూరు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన హరిత జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ఆమె కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

error: Content is protected !!