మైనార్టీలకు సీఎం జగన్ చేసింది శూన్యం : కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి

మైనార్టీలకు సీఎం జగన్ చేసింది శూన్యం
నెల్లూరు టిడిపి సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ధ్వజం
-: నెల్లూరు నగరం, ఆగస్టు 22 (సదా మీకోసం) :-
మైనార్టీలను మోసం చేసి ఓట్లేయించుకున్న సీఎం జగన్, వారికి గత ప్రభుత్వంలో అందుతున్న పథకాలను కూడా ఆపేశారని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుల్హన్ పథకం దగ్గర నుంచి రంజాన్ తోపా దాకా అన్నింటిని ఆపేసి.. నిరుపేద ముస్లీమ్ కుటుంబాలను రోడ్డున పడేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా షేక్ మహబూబ్ బాషా , ప్రధాన కార్యదర్శి గా షేక్ జాఫర్ ని నియమించామని ఆయన వెల్లడించారు.
బాలాజీ నగర్లోని తన నివాసంలోవారికి నియామక పత్రాలు అందించారు.
అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు చేసుకోమని మంత్రులకు సీఎం జగన్ లైసెన్సులు ఇచ్చేశారని మండిపడ్డారు.
మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అవీనీతికి కేరాప్ గా మారారని ధ్వజమెత్తారు.
అనంతరం జాఫర్, మహబూబ్ భాషా మాట్లాడుతూ.. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని ప్రతి ముస్లీమ్ గడపకూ వెళ్తామని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలనువారికి వివరిస్తామన్నారు.
తమ మీద నమ్మకం ఉంచి పదవులు ఇచ్చిన కోటంరెడ్డికి రుణపడి ఉంటామన్నారు.